Home తాజా వార్తలు అన్ని జిల్లాల్లో డైట్ సెంటర్ల ఏర్పాటుకు విజ్ఞప్తి: కడియం

అన్ని జిల్లాల్లో డైట్ సెంటర్ల ఏర్పాటుకు విజ్ఞప్తి: కడియం

KADIYAM

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం జరిగిన ఎన్‌సిఇఆర్‌టి 55వ కౌన్సిల్ సమావేశానికి డిప్యూటీ సిఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయ శిక్షణపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన కమిటీకి చైర్మన్‌గా కడియంను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ నియమించారు. అనంతరం మంత్రి కడియం మీడియాతో మాట్లాడుతూ… బాలికా విద్యపై సూచనలను ఎంహెచ్‌ఆర్ డికి అందజేసిన్నట్లు తెలిపారు. కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో 12వ తరగతిని చేర్చినందుకు కేంద్రానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా  ప్రీ ప్రైమరీ పాఠశాలలను ప్రారంభించాలని కోరినట్లు వెల్లడించారు. అంతేగాక తెలంగాణలోని అన్ని జిల్లాల్లో డైట్ (డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్) సెంటర్లు ఏర్పాటు చేయాలని, కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ పాఠవశాలలు  ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామని మంత్రి కడియం అన్నారు. సర్వశిక్షా అభియాన్, ఆర్‌ఎమ్‌ఎస్‌ఎ టీచర్ ట్రైనింగ్ అన్ని కలిపి సమగ్ర శిక్షా అభియాన్ పథకం ఏర్పాటు చేస్తున్నామని కేంద్రానికి సూచించిన్నట్లు వివరించారు. విద్యారంగానికి 20 శాతం బడ్జెట్ పెరిగిందని.. వచ్చే సంవత్సరం 20 శాతం నిధులు పెంచుతామని కేంద్రమంత్రి తెలిపారని మంత్రి చెప్పారు.