Home తాజా వార్తలు ఢిల్లీకి పయనమైన కడియం

ఢిల్లీకి పయనమైన కడియం

                  Kadiyam-Srihari

హైదరాబాద్: ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మంగళవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరారు. మధ్యాహ్నం 12 గంటలకు కడియం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కలవనున్నారు. ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసుల ఆమోదానికి సహకరించినందుకు వెంకయ్యకు శ్రీహరి ధన్యవాదాలు తెలపనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్‌సిఇఆర్‌టి భేటీకి హాజరుకానున్నారు.