Home తాజా వార్తలు కెటిఆర్ నాయకత్వంలో పార్టీ పటిష్టతకు కృషి : కడియం

కెటిఆర్ నాయకత్వంలో పార్టీ పటిష్టతకు కృషి : కడియం

Kadiyam Srihari Comments on KTRవరంగల్ : టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నాయకత్వంలో పార్టీ పటిష్టతకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈనెల 20న కెటిఆర్ వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో కెటిఆర్ పాల్గొనే సభ ఏర్పాట్లను కడియంతో పాటు ఎంఎల్‌ఎలు వినయ్‌భాస్కర్, ఆరూరి రమేశ్ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడారు. పంచాయతీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలపై కెటిఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశః చేస్తారని తెలిపారు. వరంగల్ సమావేశం తరువాత జనగామ జిల్లా పార్టీ కార్యకర్తలతో కెటిఆర్ భేటీ అవుతారని ఆయన పేర్కొన్నారు.

Kadiyam Srihari Comments on KTR