Home తాజా వార్తలు దళితులకు ఈరోజు గొప్పదినం: కడియం

దళితులకు ఈరోజు గొప్పదినం: కడియం

kadiam-srihari

వరంగల్:  దేశమంతా డాక్టర్ బిఅర్ అంబేడ్కర్ 127వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా  వరంగల్ లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ఈ రోజును ప్రపంచం గర్వించ దగ్గ రోజుగా కడియం పేర్కొన్నారు.  ఈ వేడుకల్లో ఎంపి సీతారం నాయక్, బండ ప్రకాశ్, జడ్పి చైర్ పర్సన్ గద్దల పద్మ, మేయర్ నన్నపనేని నరేందర్, పలువురు ఎమ్మెల్యేలు, కలెక్టర్ ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం వరంగల్ బస్ స్టేషన్ వెనుక భాగంలో నిర్మించిన నెహ్రూ యువ కేంద్రాన్ని ఆయన  ప్రారంభించారు.