Home జనగామ కోటి ఎకరాలకు నీరు.. కెసిఆర్ లక్ష్యం: కడియం

కోటి ఎకరాలకు నీరు.. కెసిఆర్ లక్ష్యం: కడియం

KADIYAM

జనగామ: ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం జనగామ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మల్లికుదుర్ల ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్షంతో ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు మూడో దశ పనులు పూర్తిచేసి స్టేషన్ ఘన్‌పూర్‌ను మరో కోనసీమగా మారుస్తామని కడియం స్పష్టం చేశారు.

Kadiyam Srihari says CM KCR’s Target is to Supply water for One Crore Acres.