Home అంతర్జాతీయ వార్తలు కడియం శ్రీహరి మెజార్టీని అధిగమించిన దయాకర్

కడియం శ్రీహరి మెజార్టీని అధిగమించిన దయాకర్

KCR-వరంగల్ : వరంగల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. టిఆర్‌ఎస్ అభ్యర్ధి దయాకర్ ప్రత్యర్థులకు అందనంతా భారీ ఆధిక్యంలో దూసుకెతున్నారు. 16వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే టిఆర్‌ఎస్‌కు 5,45,463 ఓట్లు, కాంగ్రెస్‌కు 1,37, 852 ఓట్లు, బిజెపికి 1,12,880 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లో కడియం శ్రీహరికి 3,92,513 ఓట్ల మెజార్టీ లభించింది. ప్రస్తుతం 16వ రౌండ్ ముగిసేసరికి టిఆర్‌ఎస్ అభ్యర్ధి దయాకర్ 4,07,611 ఓట్ల ఆధిక్యంతో కడియం శ్రీహరికి లభించిన మెజార్టీని అధిగమించారు. ఈ క్రమంలో టిఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు.