Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) పట్టుదల ఉంటే ఏదైన సాధించ వచ్చు..

పట్టుదల ఉంటే ఏదైన సాధించ వచ్చు..

Kaikala Satyanarayana Arya Vartagari Venture was unveiled

మన తెలంగాణ/శామీర్‌పేట: మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని అంగులతో వెంచర్‌ను ఏర్పాటు చేశారని సినీనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. ఆదివారం శామీర్‌పేట మండ లం తూంకుంట సమీపంలోని ఆర్యవార్తనగరి వెంచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పట్టుదలతో ముందుకు సాగితే ఏదైన సాధించవచ్చన్నారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా అన్ని హంగులతో రూపొందించిన ఆర్యవార్తనగరి అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అనంతరం బాలీవుడ్ నటి జరీనా ఖాన్, సినీ నటులు సాయికుమార్, అశోక్‌కుమార్, నేహా చౌదరి, జబర్ధస్త్ ఆది, రైజీంగ్‌రాజు బృందం చేసిన హస్యం ఆహుతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సుచిర్ ఇండియా వ్యవస్థాపకుడు కిరణ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.