Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

పదేళ్ల తర్వాత కుదిరింది!

Kajal

దాదాపు స్టార్ హీరోయిన్లు అందరితో చేసిన గోపీచంద్ ఇంతవరకు కాజల్‌తో జోడీ కట్టలేదు. అప్పట్లో కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘మొగుడు’ సినిమాకు ముందుగా కాజల్‌ని తీసుకోవాలని అనుకున్నారట. కానీ డేట్స్ సమస్య వల్ల, ఇతర కారణాల వల్ల కాజల్ ఈ సినిమా చేయలేకపోయింది. ఆమె స్థానంలో ఢిల్లీ భామ తాప్సీ ఆ పాత్రను పోషించింది. ఇక ఆ తర్వాత గోపీచంద్‌తో కాజల్ నటించలేదు. కానీ ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ అయింది. ప్రముఖ నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాణంలో గోపీచంద్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనుంది. కుమార్ సాయి అనే కొత్త కుర్రాడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు కథానాయికగా కాజల్‌ను తీసుకున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలుపెడతారు. గోపీచంద్, కాజల్ ఇద్దరూ తమ సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టి పదేళ్లు దాటింది. ఇప్పటికి వీళ్ల కాంబినేషన్ కుదిరింది. రకుల్‌ప్రీత్ సింగ్, అనుష్క, ప్రియమణి వంటి హీరోయిన్లతో చేసిన గోపీచంద్ ఇప్పటివరకు కాజల్‌తో నటించకపోవడం నిజంగా ఆశ్చర్యకరమే.

Comments

comments