Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

మరో లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఓకె

Kajal Agarwal Accepted Lady Oriented Movie
ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోయిన్‌లు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఓకే చెబుతున్న విషయం తెలిసిందే. అనుష్క, త్రిష, శ్రియా, నయనతార తదితరులు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. స్టార్ బ్యూటీ కాజల్ ప్రస్తుతం తెలుగులో రెండు చిత్రాలు, తమిళంలో ‘క్వీన్’ రీమేక్‌లో నటిస్తోంది. తాజాగా ఆమె మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఓకే చెప్పినట్లు తెలిసింది. దర్శకుడు భానుశంకర్ చౌదరి తాజాగా కాజల్‌కు ఓ లేడీ ఓరియెంటెడ్ స్టోర్ లైన్‌ను వినిపించినట్లుగా తెలిసింది. స్టోరీ లైన్ నచ్చడంతో కాజల్ పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేయాల్సిందిగా దర్శకుడికి సూచించిందని సమాచారం. కాజల్ ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ చేస్తూ వచ్చింది. కొన్ని సినిమాల్లో సీరియస్ పాత్రల్లో నటించినా కూడా ఆమెకు గ్లామర్ బ్యూటీగానే ఎక్కువ పేరు వచ్చింది. అందుకే ఇకపై తనలోని కొత్త యాంగిల్‌ను చూపించాలని కాజల్ భావిస్తున్నట్లుగా సమాచారం. అందుకే ఇప్పుడు మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Comments

comments