Home తాజా వార్తలు ఇప్పటికి కుదిరింది

ఇప్పటికి కుదిరింది

Agarwal

టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోలు అందరి సరసన కథానాయికగా నటించింది కాజల్ అగర్వాల్. తెలుగులో ప్రభాస్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, ఎన్‌టిఆర్‌లాంటి టాప్ రేంజ్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఖైదీ నంబర్ 150’లో నటించి పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. తమిళంలో విజయ్, సూర్య, కార్తీలాంటి స్టార్లతో సినిమాలు చేసింది కాజల్. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ జయం రవి సరసన ఈ బ్యూటీ నటించనుంది. తని ఒరువన్ చిత్రం తర్వాత టిక్ టిక్ టిక్ వంటి ప్రయోగాత్మక చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు జయం రవి. నెక్స్ అతను ‘అడంగ మారు’ అనే చిత్రంలో నటించనున్నాడు. కార్తీక్ తంగవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రంలో జయం రవికి జోడీగా కాజల్ నటించనుంది. వాస్తవానికి బోగన్ చిత్రంలో అతని సరసన కాజల్‌ను నాయికగా ఎంపిక చేసుకున్నా కాల్షీట్ల సమస్య తలెత్తడంతో  అప్పట్లో కుదరలేదు. ఇప్పటికి జయం రవితో నటించే అవకాశం ఈ బ్యూటీకి దక్కింది.