Home సినిమా శూర్పణఖ పాత్రలో కాజల్ అగర్వాల్?

శూర్పణఖ పాత్రలో కాజల్ అగర్వాల్?

Kajal Aggarwal Craze in South Film Industry increases every year

సౌత్ సినిమా ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్  క్రేజ్  ప్రతి సంవత్సరం పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు.  అయితే కొన్ని కథలకు ఇప్పుడు కాజల్ లాంటి ముద్దుగుమ్మే కావాలని అంటున్నారు దర్శకులు. ఇకపోతే ఇప్పటికే 50కి పైగా సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఎన్నో డిఫరెంట్ సినిమాలు చేసింది. ఇప్పుడు ఆమెకు ఓ పౌరాణిక చిత్రంలో నటించే అవకాశం వచ్చినట్లు తెలిసింది. సాధారణంగా కాజల్ పాత్రకు తగ్గట్టు తనను తాను మలుచుకుంటుందనే టాక్ ఉంది. ఇక  అన్నీ కుదిరితే రావణుడి సోదరి శూర్పణఖ పాత్రలో కాజల్ నటించే అవకాశాలున్నాయి. ఈ క్యారెక్టర్‌ను ఆధారంగా చేసుకొని దర్శకుడు భార్గవ్ భారీ బడ్జెట్‌తో ఓ సోషియో ఫాంటసీ మూవీని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. వాల్మీకి రాసిన రామాయణంలో శూర్పణఖ పాత్ర ఏవిధంగా ఉంటుందో చాలా మందికి తెలిసే ఉంటుంది. రాముడు, రావణుడి మధ్య యుద్ధం మొదలుకావడానికి మొదటి కారకురాలు శూర్పణకే అని చెప్పుకోవచ్చు. రాముడిపై మనసు పారేసుకొని ఆయనను దక్కించుకోవాలని ఆమె అనుకుంటుంది. ఆతర్వాత లక్ష్మణుడు శూర్పణఖముక్కు కోసేయడం… రావణుడు కోపంతో సీతను అపహరించడం వంటి అంశాల గురించి అందరికీ తెలిసిందే. అయితే శూర్పణఖ పాత్రను తెరపై చూపిస్తే అందంగా ఉంటుందని దర్శకుడు కథను సెట్ చేసుకున్నాడట. ఇప్పటికే పాత్రకు సంబంధించిన డిజైన్‌ను సెట్ చేసుకొని కాజల్‌ని ఊహించుకొని స్కెచెస్ వేశారట. అయితే ఈ స్టార్ హీరోయిన్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఈ ఆఫర్‌ను వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టినట్లు సమాచారం.