Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

శర్వానంద్‌కు జోడీగా కాజల్!

kajal2

హైదరాబాద్: యంగ్ హీరో శర్వానంద్ నటించిన ‘మహానుభావుడు’ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత శర్వానంద్ సుధీర్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ డబుల్ రోల్ చేయనున్నట్లు సమాచారం. కథలో భాగంగా ఇందులో ఇద్దరు హీరోయిన్స్‌కు అవకాశం ఉందట. ఓ పాత్ర కోసం ఇప్పటికే నివేదా థామస్‌ను ఎంపికచేసినట్లు తెలుస్తుంది. మరో పాత్రకోసం స్టార్ కథానాయిక కాజల్‌ను సంప్రదించినట్లు సమాచారం. మరి కాజల్ శర్వానంద్‌కు గ్రీన్ సిగ్న్ ఇచ్చిందో , లేదో? తెలయాల్సి ఉంది. మరోపక్క శర్వానంద్, ‘ఆర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ వంగ కాంబినేషన్‌లో ఓ మూవి రాబోతుందని సమావచారం.

Comments

comments