Home జిల్లాలు మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం

మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం

medak*ఎమ్మెల్యే మదన్‌రెడ్డి వెల్లడి
*వెల్దుర్తి మండలంలో పలు అభివృద్ధ్ది కార్యక్రమాలకు శ్రీకారం
వెల్దుర్తి : మిషన్ కాకతీయ పథకం ఒక బృహత్తర కార్యక్రమమని, ఈ పథకంతో చెరువులు పూర్వవైభవాన్ని సంతరించుకొని జలకళతో నిండుకుండలా మారనున్నాయని నర్సాపూర్ శాసనసభ్యులు మదన్‌రెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటనలు చేపట్టి అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో భాగంగా మండలంలోని మానెపల్లి, అందుగులపల్లి, కుకునూర్, యశ్వంతరావుపేట, వెల్దుర్తి, హస్తాల్‌పూర్, నాగ్సాన్‌పల్లి, మాసాయిపేట, అచ్చం పేట, ఉప్పులింగాపూర్, శెట్టిపల్లి గ్రామాల్లో చెరువుల పునరుద్దరణ పనులను ప్రారంభించారు. అదేవిధంగా మండల కేంద్రమైన వెల్దుర్తిలో మార్కెట్‌గోదాం, రామంతాపూర్‌లో మంచినీటి వాటర్ ట్యాంకును ప్రారంభించడంతో పాటు వెల్దుర్తి, మాసాయిపేట, రామంతాపూర్ గ్రామా ల్లోని పలు మజీదుల్లో అభివృద్ది పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. హస్తాల్‌పూర్ గ్రామానికి చెందిన ఎర్ర మైసయ్య అనే టిఆర్‌ఎస్ కార్యకర్త ఇటీవల రోడ్డుప్రమాదంలో మృతిచెందడంతో పార్టీ సభ్యత్వం ద్వారా వచ్చిన రూ.2లక్షల ఇన్సూరెన్స్ చెక్కును ఎమ్మెల్యే చేతులమీదుగా మృతుడి భార్య దుర్గమ్మకు అందజేశారు. ఈ సంధర్బంగా పలు గ్రామాల్లో ఏర్పాటుచేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్‌కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలకు అంతర్జాతీయ స్తాయిలో మంచిగుర్తింపు వచ్చిందన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపడుతుందని వాటిని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మైనారిటిల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన లబ్దిదారులకు చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపిపి సునితాప్రతాప్‌రెడ్డి, జడ్‌పిటిసి లక్ష్మీశ్రీనివాస్, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు మోహన్ రెడ్డి, ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు సిద్దిరాములు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు వెంకటేశం, వసంతనర్సింలు, పాండురంగాచారి, మధుసూధన్‌రెడ్డి, మల్లయ్య, నర్సింలు ఇరిగేషన్ ఎఇ కరుణ, ఆర్‌డబ్లుఎస్ డిఇ కిషన్, ఎంపిడిఓ కృష్ణన్, డిప్యూటి తహసీల్దార్ సత్యనారాయణ, నాయకులు భూపాల్‌రెడ్డి, కోదండ క్రిష్ణాగౌడ్, రమేశ్‌గౌడ్, సత్యనారాయణ, తోటనర్సింలు, స్టేషన్‌శ్రీను, వేణుగోపాల్‌రెడ్డి, కర్రె వెంకటేశం తదీతరులు పాల్గొన్నారు.