న్యూఢిల్లీ : భావితరాల వారికి స్ఫూర్తి ప్రదాయంగా ఉండేందుకు మాజీ రాష్ట్రపతి ఏపిజె అబ్దుల్ కలాం స్మారక స్థలిని నిర్మిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కలాం జన్మస్థలం రామేశ్వరంలో దీనిని ఏర్పాటు చేస్తారని, రామేశ్వరం అమృత్సిటీగా రూపుదిద్దుకుంటుందని ప్రధాని వెల్లడించారు. కలాం 84వ జయంతి సందర్భంగా గురువారం ప్రధాని మోడీ ఈ పీపుల్స్ ప్రెసిడెంట్కు నివాళులు అర్పించారు. కలాం అత్యున్నత పదవిలో ఉన్నప్ప టికీ యువతలో సృజనాత్మకతకు తపించారని , యువతరం ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని యువ శాస్త్ర జ్ఞులు ఎల్లవేళలా సామాన్యుడికి మేలు చేసే సృజనాత్మక ఆవిష్కరణలకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. కలాం పలు సంస్థలను పటిష్టంగా తీర్చిదిద్దారని దీనిని యువతరం గుర్తించి, అందుకు అనుగుణంగా స్పందించాల్సి ఉం దని తెలిపారు. ప్రజా సంబంధిత కీలక అంశాలు అంటే సైబర్ సెక్యూరిటీ, అందరికీ ఇళ్లు, నదుల అనుసంధానం, వ్యవసాయ దిగుబడులను పెంచడం, బ్లూ ఎకనామీ, ప్రామాణిక ఉత్పత్తులకు సంబంధించి పలు సృజనాత్మకత ఆవిష్కరణలు అవసరం అని ప్రధాని పిలుపు నిచ్చారు. కలాం రాష్ట్రపతి కావడానికి ముందే దేశరత్నగా నిలిచారని కొనియాడారు. డిఆర్డిఒ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. మాజీ రాష్ట్రపతి పదవిని అలంకారప్రాయం అనుకోలేదని, సవాళ్లు ఎన్ని వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నారని తెలిపారు.