Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ప్రపంచ రికార్డు స్థాయిలో ‘కాళేశ్వరం’ ప్రాజెక్టు పనులు

Kaleshwaram project to set record of sorts

వచ్చే యాసంగిలోపు 30వేల ఎకరాలకు సాగునీరందిస్తాం
ప్రాజెక్టుబాటలో మంత్రి ‘తన్నీరుహరిష్‌రావు’
మనతెలంగాణ/ఇల్లంతకుంట: ‘కాళేశ్వరం’ ప్రాజెక్టు పనులు ప్రాంరంభించి రెండు సంవత్సరాలు పూర్తయయ్యాని, ప్రపంచ రికార్డు స్థాయిలో ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. బుధవారం మండలంలోని తిప్పాపూర్ సమీపంలోని కాళేశ్వరంలో ప్రాజెక్టులో భాగంగా ప్రాణహిత చెవెళ్ల 10వ ప్యాకేజి పంప్‌హౌజ్, టన్నెల్, సర్జిఫుల్ పనులను చిఫ్‌ఇంజనీర్ హరేరామ్ బృందంతో కలసి ఆయన సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా భూగర్భజల ప్రాజెక్టును స్వయంగా పరిశీలించారు. సర్జిఫుల్ , పంప్‌హౌజ్‌ల నిర్మాణం పై అధికారులను వివరాలు అడిగితెలుసుకున్నారు. ఇప్పటి వరకు బండ్ 2, బండ్3 పనులు పూర్తయ్యాయని, బండ్ 1 పనులు మాత్రం ఇంకా 25లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని మిగిలిఉందన్నారు.

యాబై రోజులు లోపు ఇంకా మిగిలి ఉన్న నాన్ ఓవర్‌ఫ్లో డ్యాం 14వేల క్యూబిక్ మీటర్ల కాంక్రిటు పనితో పాటుగా బండ్ 1 పనులు పూర్తి చేయ్యాలని అధికారులను ఆదేశించారు. అనంతగిరి రిజార్వాయర్ సమీపంలో నిర్మిస్తున్న 400కెవి సబ్‌స్టేషన్ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని, వెంటనే వాటిని కూడా వేగవంతం చేయాలని, 46 కిలోమీటర్ల మేర లైన్‌ను టవర్‌లు వేసుకుంటూ సబ్‌స్టేషన్ వరకు తీసుకరావాలని ఆదేశించారు. వచ్చే యాసంగి లోపు రిజార్వాయర్ ద్వారా 30 వేల ఎకరాలకు సాగునీరందిస్తామని ఆయన తెలిపారు. అనంతగరి రిజార్వాయర్ భూ నిర్వసితులకు సిరిసిల్ల పరిసర ప్రాంతంలో పునరావాసం కల్పిస్తామని హామి ఇచ్చామని, కానీ మోజార్టీ ప్రజలు పునరావాసం కాకుండా డబ్బులు కావాలని అడుగుతున్నారని, వారికి డబ్బులను కూడా అందిస్తామని తెలిపారు. లేదంటే డబుల్ బెడ్ రూం ఇండ్లను కట్టిస్తామని హామి ఇచ్చారు. అనంతగిరి భూ నిర్వసితుల కోసం రూ.100కొట్లను మంజూరు చేశామని కలెక్టర్ ద్వారా పంపిణీ చేయాలని సూచించినట్లు మంత్రి తెలిపారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్‌హెగ్డే, ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.

Comments

comments