Home తాజా వార్తలు కాళేశ్వరంలో వెట్ రన్ విజయవంతం

కాళేశ్వరంలో వెట్ రన్ విజయవంతం

Kaleshwaram Project

 

జయశంకర్‌భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు వెట్ రన్ విజయవంతమైంది. భగీరథ ప్రయత్నంలో మరో అద్భుత జలదృశ్యం ఆవిష్కృతమైంది. నందిమేడారం రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేశారు. నందిమేడారం నుంచి లక్ష్మీపూర్ సర్జ్‌పూల్‌కు గోదావరి జలాలు చేరుకోనున్నాయి. అనంతరం లక్ష్మీపూర్ నుంచి ఎత్తిపోతల ద్వారా మిడ్‌మానేరుకు నీళ్లు చేరుతాయి. మొదటి పంపును  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. 124.4 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్న పంపులను వాడారు. ఆసియాలోనే అతి పెద్ద మోటార్లను కాళేశ్వరం ప్రాజెక్టులో వినియోగిస్తుండడంతో వీటికి బాహుబలి మోటార్లు అని పేరు పెట్టారు. 

 

Kaleshwaram Project Water Released from Nandi Medaram