Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

విశ్వ మెగా ప్రాజెక్టు

  • కాళేశ్వరం ప్రపంచంలోనే అతి పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు కానున్నది
  • కొత్త ఏడాదికల్లా ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు నీరు పంపింగ్‌కు సమస్తం సిద్ధం చేయాలి
  • ప్రతి 15 రోజులకు ఒకసారి పురోగతిని సమీక్షించాలి
  • అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం

Harish-Rao

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలో మెగా ప్రాజెక్టు కానుందని సాగునీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. డిసెంబరు చివరినాటికి ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీటిని పంపింగ్ చేసేందుకు సమస్తం సిద్ధం చేయాలని అధికారులను, కాంట్రాక్టు ఏజెన్సీలను మంత్రి ఆదేశించారు. అతి తక్కువ సమయంలో ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తే ఆ క్రెడిట్ ప్రభుత్వంతో పాటు ఏజెన్సీలకు దక్కుతుందన్నారు. ప్రతి 15 రోజులకొకసారి బిహెచ్‌ఇఎల్ ఉన్నతాధికారులు ప్రాజెక్టు సైటును సందర్శించి, పంపుల ఎరక్షన్, టెస్టింగ్, కమిషనింగ్ పనుల పురోగతిని సమీక్షించాలని కోరారు. ఈ మూడు నెలల వ్య వధి అత్యంత కీలకమైనందున ప్రతి పంపింగ్ స్టేషన్‌లో అనుభవజ్ఞులైన ఇద్దరు సూపర్‌వైజరీ అధికారులను నియమించాలని మంత్రి బిహెచ్‌ఇఎల్ అధికారులకు సూచించారు. కాళేశ్వరం ప్యాకేజీ 6, 8ల పంపింగ్ స్టేషన్లను షెడ్యూలు ప్రకారం పూర్తి చేయాలన్నారు. శనివారం జలసౌధలో ఈ ప్రాజెక్టు పనులపై బిహెచ్‌ఇఎల్, ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీలు మెగా ఇంజినీరింగ్, నవయుగ సంస్థ ప్రతినిధులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్యాకేజీ 6 పంపింగ్ స్టేషన్‌లో తొలి పంపును ఈ ఏడాది డి సెంబరు చివరినాటికి అమర్చాలని, రెండో పంపు ను 2018 జనవరి చివరికి కమిషనింగ్ చేయాలని ఆదేశించారు. మిగతా పంపులన్నింటినీ 2018 జూలై కల్లా అమర్చాలని ఆయన కోరారు. ఇక ప్యాకేజీ 8 పంపింగ్ స్టేషన్‌లో మొదటి పంపు కమిషనింగ్ ప్రక్రియను ఈ నవంబరు వరకు పూర్తిచేయాలని ఆదేశించారు. రెండో పంపు కమిషనింగ్ ప్రక్రియ డిసెంబరు చివరికి పూర్తికావాలన్నారు. ప్రతిష్టాత్మక కాళేశ్వరంను త్వరితగతిన పూర్తిచేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మెగా, నవయుగ సంస్థలను మంత్రి ఆదేశించారు. ట్రాన్స్‌కోతో సమన్వయం చేసుకొని సబ్‌స్టేషన్ల నిర్మాణం పూర్తిచేయాలని కోరారు. ఏజెన్సీలు, బిహెచ్‌ఇఎల్‌తో సమన్వయం చేసుకుంటేనే పనులు షెడ్యూలు ప్రకారం పూర్తవుతాయన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం సాగునీటి కోసమే కాదని, ప్రధమ ప్రాధాన్యత కింద హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చనుందని మంత్రి గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టుతో మిషన్ భగీరథ పథకాన్ని అనుసంధానం చేసి 2017 డిసెంబరు కల్లా తాగునీటి సరఫరా చేయనున్నట్లు చెప్పారు. బిహెచ్‌ఇఎల్‌కు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌సి)ను సెప్టెంబరు 10వ తేదీలోగా ఇవ్వాలని ఏజెన్సీలను మంత్రి హరీశ్‌రావు కోరారు. వెంటనే యంత్ర పరికరాలను రవాణా చేయాలని సూచించారు. కల్వకుర్తి మూడో దశ పంపింగ్ స్టేషన్లో ఇదివరకే మూడు పంపులను కమిషనింగ్ చేసామని, నాలుగో పంపును మరో రెండు మూడు రోజుల్లో కమిషనింగ్ చేస్తున్నట్లు మహబూబ్‌నగర్ ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ఖగేందర్‌రావు తెలిపారు. ఐదో పంపునకు సంబంధించి గతంలో బిహెచ్‌ఇఎల్ సరఫరా చేసిన ట్రాన్స్‌ఫార్మర్ చెడిపోయిందని, దాని స్థానంలో మరో ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని సిఇ కోరారు. వాటితో పాటు మరికొన్ని యంత్ర పరికరాలను బిహెచ్‌ఇఎల్ సరఫరా చేయాల్సి ఉన్నట్లు ఖగేందర్‌రావు చెప్పారు. నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ పంపుహౌజ్‌లో ఆటోమేటిక్ యంత్ర పరికరాలు సరిగ్గా పనిచేయడం లేదని, నిపుణులతో వాటిని తనిఖీ చేయించి మరమ్మత్తులు చేపట్టాలని కోరారు. దీంతో కల్వకుర్తి ఐదో పం పు బిగింపు పనులను అక్టోబరు చివరి నాటికి పూర్తిచేయాలని మంత్రి బిహెచ్‌ఇఎల్ అధికారులకు సూ చించారు. నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ పంపుహౌజ్‌లో ఆ టోమేటిక్ యంత్ర పరికరాలు సరిగ్గా పనిచేయడం లే దని, నిపుణులతో వాటిని తనిఖీ చేయించి, మరమ్మత్తు లు చేయించాలని సిఇ కోరారు. దీంతో కల్వకుర్తి ఐదో పంపు బిగింపు పనులను పూర్తి చేయడంతో పాటు నెట్టెంపాడు, కోయిల్ సాగర్ సమస్యలు కూడా పరిష్కరించాలని బిహెచ్‌ఇఎల్ అధికారులకు మంత్రి సూ చించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 20కు చెందిన పంపుహౌజ్ పనులను 2018 జూన్ వరకు పూర్తిచేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు ప్రభుత్వ ప్రత్యేక ప్రధా న కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి, ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్, బిహెచ్‌ఇఎల్ ఉన్నతాధికారులు దినేష్ కుమార్ త్రిపాటి, రాజీవ్ సింగ్, సౌందర్య రాజ న్, యోగేందర్‌పాల్, వికాస్ మంకార్, శరవణన్, కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ ఎన్.వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments