Home రాజన్న సిరిసిల్ల సస్యశ్యామలం కానున్న మెట్ట ప్రాంతాలు

సస్యశ్యామలం కానున్న మెట్ట ప్రాంతాలు

Kaleshwaram water for 38 lakh acres

38 లక్షల ఎకరాలకు కాళేశ్వరం నీరు
మంత్రి కల్వకుంట్ల తారకరామారావు

మనతెలంగాణ/సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రంలోని మెట్ట ప్రాంతాలన్నీ త్వరలోనే సాగునీటితో సస్యశ్యామలం కానున్నాయని ఐటి, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మండలం సర్దాపూర్ గ్రామంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి వ్యవసాయకళాశా ల భవన నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించిన అ నంతరం ఏర్పాటు చేసిన రైతుబీమా అవగాహన సదస్సు కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ మాట్లాడారు. తెలంగాణలోని 38లక్షల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా సా గునీటిని అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.18 నుం డి 60సంవత్సరాల వయస్సుకల రైతులు సాధారణంగా కా ని ప్రమాదవశాత్తు కాని మృతి చెందితే 10 రోజుల్లో 5,00, 000 రూపాయల చెక్కు ఆ రైతు కుటుంబానికి అందుతుందని మంత్రి వివరించారు. జూలై 10వ తేదిలోగా రైతులు తమ నామినీ ఎవరో వివరిస్తూ రైతు బీమా పథకం అర్జీని నింపితే సరిపోతుందన్నారు.జిల్లా రైతుబంధు పథకం అమలులో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచినట్లే రైతుబీమా పథకంలో చేరడంలోనూ జిల్లా మొదటి స్థానం సాధించాలన్నా రు. రైతు బీమా పథకం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపో యే పథకమని వివరించారు. వ్యవసాయ,రెవెన్యూ అధికారులు ఎల్‌ఐసి అధికారులతో కలిసి మండలాల వారిగా రై తులకు అవగాహన సదస్సులు నిర్వహించి,రైతులకున్న అనుమానాలను తొలగించాలని సూచించారు.సిరిసిల్లలో ఇప్పటివరకు 2000 మంది రైతులు బీమా ఫారాలు నింపారని వివరించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత సిఎం కేసిఆర్‌లా గా రైతులకు ఇంతగా ప్రయోజనం కలిగేలా తీసుకున్న ని ర్ణయాలను గతంలో ఏ ప్రధాన మంత్రి, ఏ ముఖ్యమంత్రికూడా తీసుకోలేదన్నారు. సిఎం కెసిఆర్ నిర్ణయాలు చరిత్ర పుటల్లో నిలిచిపోతాయన్నారు.వచ్చే ఆరుమాసాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా వాసుల 2 లక్షల ఎకరాల సాగుభూములకు గోదావరి జలాలు అందిస్తామన్నారు.గోదావరి, కృష్ణానదు ల్లో రాష్ట్రం వాటా 1200 టిఎంసిలను చుక్కకూడా వృధాపోకుండా పథకాలు రచిస్తున్నామన్నారు.దేశ ప్రధానిగా జ వహర్‌లాల్ నెహ్రూ ఉన్నప్పుడు ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేశారని, నేటికీ ఎస్‌ఆర్‌ఎస్‌పి రెండో దశ పూర్తి కాలేదన్నారు. సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కాలంతో పోటిపడుతూ శ రవేగంతో పరుగులు తీస్తోందన్నారు.నాలుగేళ్ల క్రితం ఉ మ్మడి రాష్ట్రంలో రైతులు తీవ్ర నిర్లక్షానికి గురికాగా తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతుల కష్టాలను దూరం చేసేందు కు సిఎం కెసిఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. రైతాంగానికే కాదు అన్ని రంగాలకు కూడా 24 గంటల వి ద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక సస్యశ్యామలం కానున్న మెట్ట ప్రాంతాలు రాష్ట్రం తెలంగాణ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరెంట్, విత్తనాలు, ఎరువులు సరైన సమయానికే అందుతున్నాయన్నారు. స్వామినాథన్ కమీషన్ వ్యవసాయ రంగం అభివృధ్ధికి చేసిన సూచనలను ఇంతకాలం ఎవరూ పట్టించుకోలేదని, సిఎం కేసిఆర్ దాన్ని తన రైతు అనుకూల చర్యల ద్వారా అమలు చేస్తున్నారన్నారు.వ్యవసాయాన్ని పండుగలా చేయాలనే సిఎం కేసిఆర్ రైతు బంధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. రైతు యూనిట్‌గా బీమా అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మాణం చేసి ఏడాది క్రితమే కేంద్ర ప్రభుత్వానికి పంపితే ఇప్పటివరకు దానిపై ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. సిరిసిల్ల ప్రాంతం కష్టాలు చూసిన ప్రాంతమని, నిత్యం రైతన్నలు, నేతన్నల ఆత్మహత్యలకు కేరాఫ్‌గా ఉండేదని ఇప్పుడా పరిస్థితి మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ చెన్నమనేని రమేశ్‌రావు,టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, జడ్‌పి చై ర్మన్ తుల ఉమ,రైతు సమన్వయసమితి జిల్లా కో ఆర్డినేటర్ గడ్డం నర్సయ్య, సెస్ చైర్మన్ దోర్నాల లకా్ష్మరెడ్డి, డిసిఎంఎస్ చైర్మన్ ఎం సురేందర్ రెడ్డి, రీజినల్ ఆర్గనైజర్ గుగులోతు రేణ, కలెక్టర్ కృష్ణభాస్కర్, జెసి యాస్మిన్ భాషా, డిఆర్‌వో శ్యాంప్రసాద్‌లాల్, జిల్లా వ్యవసాయ అధికారి ఆర్ అనిల్‌కుమార్, జడ్పిటిసి పుర్మాణి మంజుల, ఎంపిపి జూపల్లి శ్రీలత, సర్పంచులు అగ్గిరాములు, మధు, వ్యవసాయ కళాశాల వైస్‌చాన్సలర్ డా. వి ప్రవీణ్‌రావు అధికారులు పాల్గొన్నారు.