హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కల్కి’ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇటీవల ‘గరుడవేగ’ చిత్రంతో మంచి హిట్ కొట్టిన రాజశేఖర్ వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘కల్కి’పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. సీనియర్ నిర్మాత సి.కల్యాణ్ నిర్మిస్తోన్న ‘కల్కి’ ఓ డిఫరెంట్ కథాంశంతో రూపొందుతోందని సమాచారం. తాజాగా విడుదలైన టీజర్ లో రాజశేఖర్ యంగ్రీయంగ్ మ్యాన్ లా తన మునుపటి లుక్ తో ఆకట్టుకుంటున్నాడు.
Kalki Rajasekhar Birthday Teaser is Released