Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

వారాంతపు సంతలో కల్లు దుకాణాలు

రాత్రుల్లో తయారు… ఉదయమే సరఫరా మామూళ్ళ మత్తులో పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు
వ్యాపారులకు ముందస్తు సమాచారమిస్తూ ఉత్తుత్తి తనిఖీలు

KALLU

మన తెలంగాణ/మర్పల్లి : మర్పల్లి మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారాంతపు సంత జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు మర్పల్లి ఎక్సైజ్ సిఐ పరిధిలోని నాలుగు మండలాల్లో కూడా వారాంతపు సంతలు జరు గుతున్నాయి. మండల కేంద్రంలో ఎక్సైజ్ అధికారుల అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా కల్లు దుకాణాలను ఏర్పాటు చేసుకుంటు న్నా అధికారులు వారిచ్చే మామూళ్ళ మత్తులో జోగుతూ పట్టించు కోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మర్పల్లిలో మామూలు రోజుల్లో నాలుగైదు దుకాణాల్లోనే కల్లును విక్రయిస్తున్నారని అదే మంగళవారం అయితే అనుమతులు లేకుండానే ఇష్టమున్న స్థలాల్లో దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. మంగళవారం లో నూతనంగా ఓ కల్లు దుకాణం ఏర్పాటయింది. అలా ఒక్క మర్పల్లి మండల కేంద్రంలోనే కాకుండా మర్పల్లి ఎక్సైజ్ పరిధిలో ఉన్న మోమిన్‌పేట్, బంట్వారం, ధారూర్ మండలాల్లోనూ వారాం తపు సంతలు జరుగుతాయని, ఆ ప్రాంతాల్లో కూడా సంతలలో విచ్చలవిడిగా కల్లు దుకాణాలు వెలుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

వారాంతపు సంతలు వచ్చాయంటే కల్లు విక్రయదారులకు వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరజిల్లుతున్నాయని ప్రజలు అరోపించారు. సంత ఈరోజు ఉందనగా రాత్రివేళల్లో కల్లును తయారు చేస్తూ ఉదయం లేవగానే ఆటోలలో సంతల ప్రాంతానికి తరలిస్తున్నారు. సమయానికి మంచినీళ్ళు దొరకక పోవచ్చుకాని కల్లు మాత్రం అడుగు అడుగునా దొరుకు తుందని దారినపోయే వారు పేర్కొనడం గమనార్హం. దుకాణాల ముందు నుండే అధికారులు రాకపోకలు సాగి స్తున్నా అవి మాత్రం కనిపించడం లేదు. వ్యాపారాన్ని బట్టి మామూళ్ళు ఇస్తుంటామని, వారికి మేమెందుకు భయపడాలని కొందరు కల్లు విక్రయ దారులు బహిరంగంగా పేర్కొనడం గమనార్హం. ఎక్సైజ్ పరిధిలో ఉన్న ప్రతి మండలంలోని కొన్నిగ్రామాలకు చెందిన కొందురు వ్యాపారులు అధికారుల కనుసైగల్లో ఉంటున్నట్లు తెలిసింది. ఒకవేళ ఏ ప్రాంతానికైనా తనిఖీల కోసం వెళ్లినా కొందరు సిబ్బంది ముందుగానే ఎక్కడికి వస్తున్నామనే విషయాలను కొందరు వాప్యారస్తులకు సమాచారం ఇస్తున్నారని, వారు ముందు జాగ్రత చర్యగా ఉంటున్నట్లు తెలిసింది. వచ్చామా.. వెళ్లామా అనే ధోరిణిలో అధికారులు వ్యవహరిస్తుండటం విడ్డూరంగా ఉందని కొందరు విమర్షిస్తుండటం చూస్తుంటే వారి ఉద్యోగ నిర్వహణ ఎలా ఉందనేది ఇట్టే అర్థమవు తువుంది.
బెల్టు దుకాణాల ఊసెత్తని అధికారులు
కల్లు విక్రయాలది ఇలా ఉంటే బెల్టుషాపుల విక్రయదారులది మరోరకంగా ఉంది. మర్పల్లి ఎక్సైజ్ సిఐ సర్కిల్ పరిధిలోని నాలుగు మండలాల్లో సుమారుగా 60వరకు బెల్టు దుకాణాలున్నట్లు తెలిసింది. వీరి నుంది అధికారులు ప్రతినెలా మామూళ్లు వసూలు చేస్తూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ప్రజలనుండి వినిపిస్తున్నాయి. ఇప్పడికైనా అధికారులు స్పందించి అనుమతులు లేకుండా వెలుస్తున్న కల్లు దుకాణాలు, బెల్టు దుకాణాలను నియంత్రించి తమ కుటుంబ యజమానుల ప్రాణాలను కాపాడాలని మర్పల్లి మండల ప్రజలు ఎక్సైజ్ అధికారులను కోరుతున్నారు.

Comments

comments