Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

సినీ నటి కల్పనారంజని కన్నుమూత

KALPANAహైదరాబాద్ : మళయాళ సినీ పరిశ్రమకు చెందిన కల్పనారంజని(51) సోమవారం ఉదయం కన్నుమూశారు. తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం షూటింగ్ కోసం ఆమె హైదరాబాద్‌కు వచ్చారు. హోటల్ గదిలో ఆమె అపస్మారక స్థితిలో ఉండడంతో వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కల్పన చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. కల్పన నటించిన చివరి చిత్రం చార్లీ. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రంలో ఆమెది ప్రధానపాత్ర కాకపోయినా, ఇందులో ఆమె క్యాన్సర్ పేషంట్‌గా అద్భుతమైన నటన కనబర్చారు. ఈ చిత్రం ఇప్పటికీ ధియేటర్లలో ఆడుతోంది. కల్పన పూర్తి పేరు కల్పన రంజిని. 1983లో మళయాళ సినిమా ద్వారా తెరంగ్రేటం చేశారు. ఇప్పటి వరకు ఆమె మళయాలం, తమిళం, తెలుగు ఇలా పలు భాషల్లో సుమార 300 చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన ఎన్నో చిత్రాలు తెలుగులో అనువాదం అయ్యాయి. 2012లో ఆమె ఉత్తమ సహాయనటీగా జాతీయ అవార్డు అందుకున్నారు. తెలుగులో వెంకటేష్ నటించిన ప్రేమ చిత్రంలో నటించారు.

Comments

comments