Home తాజా వార్తలు ఉత్కంఠగా ‘118’ ట్రైలర్

ఉత్కంఠగా ‘118’ ట్రైలర్

 

హైదరాబాద్:నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కె.వి.గుహ‌న్ తెరకెక్కిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘118’. ఈ సినిమాల్ కళ్యాణ్ రామ్ సరసన షాలిని పాండే, నివేదా థామస్ నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌ కు మంచి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్రయూనిట్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది.

ఇందులో.. ‘స్టార్ట్ చేసింది ఏదైనా సగం లో ఆపాలంటే నాకు చిన్నపట్నుంచి చెడ్డ చికాకు ఏంటో వెధవ క్యూరియాసిటీ అంటూ కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఉందో లేదో తెలియని ఓ అమ్మాయి మర్డర్ మిస్టరీని కళ్యాణ్ రామ్ ఛేదించడం.. ఏ పనిచేసినా లాజిక్‌గా ఆలోచించే కళ్యాణ్ రామ్.. లాజిక్ లేని పనికోసం సీరియస్‌గా ఆలోచించడం.. చివరికి ఆ లాజిక్‌ ‘118’తో ముడి పడి ఉండటం ట్రైలర్ లో ఎంతో ఉత్కంఠగా చూపించారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేష్‌ ఎస్‌ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శేఖర్‌ చంద్ర స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 1 ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రయూనిట్ ప్రయత్నిస్తుంది.

Kalyan Ram 118 movie Trailer launch