Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

కల్యాణ్‌రామ్ నటన హైలైట్‌గా షేర్

shareనందమూరి కల్యాణ్‌రామ్-సోనాల్ చౌహాన్ జంటగా మల్లిఖార్జున్ దర్శకత్వంలో విజయలక్ష్మి పిక్చర్స్ పతాకంపై కొమర వెంకటేష్ నిర్మించిన చిత్రం ‘షేర్’. తమన్ ఎస్‌ఎస్ సంగీతమందించిన ఈ సినిమా తాజాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ఛాంబర్‌లో సక్సెస్‌మీట్‌ను ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో దర్శకుడు మల్లిఖార్జున్ మాట్లాడుతూ “షేర్ సినిమా రిలీజ్ రోజు నుంచి మంచి టాక్‌తో నడుస్తోంది. ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసలొచ్చాయి. ఫైట్స్, పాటల్లో అదరగొట్టాడు. బ్రహ్మానందం, రఘు కారుమంచి, పృథ్వీ సహా తెరకెక్కించిన సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాయి. కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కని చిత్రమిది”అని అన్నారు. నిర్మాత కొమర వెంకటేష్ మాట్లాడుతూ “హీరో కల్యాణ్‌రామ్ నటన చిత్రానికే హైలైట్. హాస్యం సినిమాకే హైలైట్. ముఖ్యంగా చివరి 25 నిమిషాల సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వస్తోంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రచయిత డైమండ్ రత్నం, రఘు కారుమంచి పాల్గొన్నారు.

Comments

comments