Search
Thursday 15 November 2018
  • :
  • :

పూరీ డైరెక్షన్‌లో కల్యాణ్‌రామ్

puri-kalyan‘అతనొక్కడే’ చిత్రం నుండి ‘పటాస్’ వరకు డిఫరెంట్ మూవీస్‌లో నటించిన కథానాయకుడు నందమూరి కల్యాణ్‌రామ్. ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్‌లో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. కల్యాణ్‌రామ్ కోసం పూరీ ఓ సూపర్ సబ్జెక్ట్‌ను రెడీ చేశాడు. ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ చిత్రం ఏప్రిల్ నెల నుండి రెగ్యులర్ చిత్రీకరణను జరుపుకోనుంది. నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ను పూరీ అందిస్తున్నాడు. త్వరలోనే మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను తెలియజేస్తారు. ‘పటాస్’తో హీరోగా, నిర్మాతగా మంచి రేంజ్ పెంచుకున్న కల్యాణ్‌రామ్ ఈ చిత్రంతో మరో హిట్ కొడతానని ధీమాగా ఉన్నాడు.

Comments

comments