Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

వీరుపోట్ల డైరెక్షన్‌లో కల్యాణ్‌రామ్

kalyan-ram‘పటాస్’ సినిమాతో ఫామ్‌లోకి వచ్చేశాడు నందమూరి కల్యాణ్‌రామ్. ప్రస్తుతం అతను మల్లిఖార్జున్ దర్శకత్వంలో ‘షేర్’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది. కల్యాణ్‌రామ్ తదుపరి సినిమా కూడా ఖరారైంది. రైటర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దర్శకుడిగా మారి బిందాస్, రగడ, దూసుకెళ్తా సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్‌లను అందుకున్న వీరుపోట్ల దర్శకత్వంలో నటించబోతున్నాడు కల్యాణ్‌రామ్. ఈ సినిమాను కల్యాణ్‌రామ్ తన సొంత బ్యానర్‌లో నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి. ‘దూసుకెళ్తా’ హిట్టయినప్పటికీ తన తర్వాతి సినిమా విషయంలో చాలా గ్యాప్ తీసుకున్నాడు వీరుపోట్ల. రవితేజ, వెంకటేష్‌ల కాంబినేషన్‌లో మల్టీస్టారర్ చేయడానికి ప్రయత్నాలు చేశాడు కానీ అది వర్కవుట్ కాలేదు. ఆతర్వాత గోపీచంద్ హీరోగా సినిమా అన్నారు. అదీ పట్టాలెక్కలేదు. చివరకు కల్యాణ్‌రామ్‌తో సినిమా ఓకే అయ్యింది.

Comments

comments