Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

కల్యాణ్‌రామ్‌తో మహేశ్ కోనేరు చిత్రం ప్రారంభం

ntr

నందమూరి కల్యాణ్‌రామ్, నివేదా థామస్, షాలిని పాండే హీరోహీరోయిన్లుగా ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న కొత్త చిత్రం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. కె.వి.గుహన్ దర్శకత్వంలో మహేశ్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి ఎన్టీఆర్ క్లాప్ కొట్టగా నందమూరి హరికృష్ణ కెమెరా స్విచ్చాన్ చేశారు. నందమూరి రామకృష్ణ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన విలేకరుల సమావేశంలో దర్శకుడు కె.వి.గుహన్ మాట్లాడుతూ “కల్యాణ్ హీరోగా మహేశ్ కోనేరు నిర్మాణంలో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది”అని అన్నారు. నిర్మాత మహేశ్ కోనేరు మాట్లాడుతూ “కల్యాణ్‌రామ్‌తో మా బ్యానర్‌లో ‘నా నువ్వే’ సినిమా చేశాం. అది త్వరలోనే విడుదలకానుంది. ఆ సినిమా విడుదలయ్యే లోపు కల్యాణ్‌రామ్‌తోనే రెండో సినిమాను నిర్మించనుండటం ఎంతో ఆనందంగా ఉంది. గుహన్ చెప్పిన స్క్రిప్ట్ మాకు నచ్చింది. అలాగే కల్యాణ్‌రామ్‌కు కూడా నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. మే 2 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. శేఖర్ చంద్ర మా సినిమాకు సంగీతాన్ని అందించనుండటం హ్యాపీగా ఉంది”అని పేర్కొన్నారు. షాలిని పాండే మాట్లాడుతూ “తెలుగులో నా రెండో సినిమా ఇది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది”అని తెలిపారు. నివేదా థామస్ మాట్లాడుతూ “గుహన్ స్క్రిప్ట్‌ను తమిళంలో వినిపించారు. స్క్రిప్ట్ నచ్చి ఈ సినిమా చేస్తున్నాను. ఆరు నెలల గ్యాప్ తర్వాత ఈ తెలుగు సినిమాలో నటిస్తున్నాను”అని పేర్కొన్నారు.

Comments

comments