Home తాజా వార్తలు పల్లెటూరి నేపథ్యంలో…

పల్లెటూరి నేపథ్యంలో…

నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కబోతున్న సినిమా ‘తుగ్లక్’. ఈ సినిమా తర్వాత ఉయ్యాల జంపాల, మజ్ను చిత్రాల దర్శకుడు విరించి వర్మతో ఆయన సినిమా చేయబోతున్నట్లు తెలిసింది. ఈ దర్శకుడు తన రెండో సినిమాను నానీతో ‘మజ్ను’ తీసి పర్వాలేదనిపించుకున్నాడు. కాగా నందమూరి కల్యాణ్‌రామ్‌తో సినిమా కోసం విరించి వర్మ ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి చేసినట్లు తెలిసింది.

మే నెలలో ఈ సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టాలని చూస్తున్నారట. అయితే ఈ సినిమా పల్లెటూరి నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రానుంది. ఇక ఇటీవల ‘118’ చిత్రంతో మంచి హిట్‌ను అందుకున్నారు కల్యాణ్‌రామ్. కె.వి.గుహన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

Kalyan Ram’s Tughlaq movie in Village Backdrop