Home సినిమా నాగశౌర్యకు జోడీగా కళ్యాణి ప్రియదర్శన్

నాగశౌర్యకు జోడీగా కళ్యాణి ప్రియదర్శన్

cini

యంగ్ హీరో నాగశౌర్య కెరీర్‌లోనే పెద్ద హిట్‌నిచ్చిన చిత్రం ‘ఛలో’. ఈ చిత్రం తర్వాత అతను చేస్తున్న సినిమా ‘నర్తనశాల’. పాత క్లాసిక్ మూవీకి ఎలాంటి సంబంధం లేకుండా కేవలం టైటిల్ మాత్రమే వాడుకున్నామని దీనికి దర్శకత్వం వహిస్తున్న చక్రవర్తి స్పష్టంచేశాడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో హీరోయిన్‌గా తొలుత మెహ్రీన్‌ను అనుకున్నారు. కానీ ఆమె అడిగిన రెమ్యునరేషన్‌ను ఫిల్మ్‌మేకర్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌గా ‘హలో’ ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్‌ను తీసుకున్నారని తెలిసింది. ఈ చిత్రం ఆమెకు లక్కీ ఆఫర్‌గానే చెప్పుకోవచ్చు. ఇక ‘హలో’ సినిమా అంతగా ఆడకపోయినా కళ్యాణి ప్రియదర్శన్‌కు శర్వానంద్ సినిమాలో కూడా అవకాశం దక్కింది. ఇప్పుడు నాగశౌర్యతో జతకట్టింది. ఈ చిత్రంతో మంచి హిట్‌ను దక్కించుకోవాలని కళ్యాణి తహతహలాడుతోంది. ఇక విభిన్నమైన కథాంశంతో దర్శకుడు చక్రవర్తి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.