Search
Wednesday 21 November 2018
  • :
  • :

రెండుగా కామారెడ్డి

                 KamaReddy

కామారెడ్డి: కామారెడ్డి నియోజక వర్గం పరిదిలో దోమ కొండ నియోజక వర్గంగా ఏర్పడే అవకాశాలున్నాయి.కామారెడ్డి జిల్లా లోని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకే దోమకొండ మండల కేంద్రంలో గత పదిరోజులుగా అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిల పక్షం ఆధ్వర్యంలో సాధన కమిటీగా ఏర్పడి పాత బస్టాండు గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దోమకొండకు రాష్ట్రంలోనే ఘన మైన చరిత్ర ఉందని పునర్విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ నియోజక వర్గాలు పెంచే ప్రక్రియ ప్రారంభం కాబోతున్న తరుణంలో కామారెడ్డి నియోజకవర్గంలో మరో అసెంబ్లీ నియోజక వర్గానికి అవకాశం ఉందని సంకేతాలతో రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్లు సమాచారం. కెసిఆర్ పూర్వీకుల గ్రామం దోమకొండ మండలంలో ఉండడంతో దోమకొండ అసెంబ్లీ నియోజక వర్గంగా ఏర్పాటు కానుందని బలమైన సంకేతాలు న్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 119 అసెంబ్లీ నియోజక వర్గా లున్నాయి.విభజన చట్టం ప్రకారం 153 పెరగనున్నాయి.నూతనంగా 34 స్థానాలు తెలంగాణలో ఏర్పాటు కానున్నాయి.కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధిక జనాభా ఉండడంతో నూతన నియోజక వర్గం ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. కామారెడ్డి నియోజక వర్గంలో కామారెడ్డి, దోమకొండ, బిక్కనూరు, మాచారెడ్డి, బిబిపేట్, రాజం పేట మండలాలున్నాయి.కామారెడ్డి మండలం కామారెడ్డి మున్సి పాలిటి (అర్బన్,రూరల్) కలిపి రూరల్ పరిధిలో కామారెడ్డి నియోజక వర్గం దోమకొండ మాచారెడ్డి, బిక్కనూరు, బిబిపేట, రాజంపేట మండ లాలతో దోమకొండ అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు కావడానికి తగినంత జనాభా ఉంది.

టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ రాజకీయ ప్రత్య ర్థులను ఎదురుకునే వ్యూహంలో కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు కాను న్నాయి. అందులో భాగంగా మాజీ మంత్రి కాంగ్రెస్ శాసన మండలి పక్షనేత షబ్బీర్ అలీ జిల్లా కేంద్రంలో ఉండడంతో కామారెడ్డి నియోజక వర్గంలో ప్రతి పక్షం బలంగా ఉండడంతో కేసీఆర్ దృష్టి కామారెడ్డిపైన ఉందని రాజకీయ వర్గాల్లో ప్రధానాంశంగా మారింది.తెలంగాణ ఉద్య మాన్ని కంటే ముందు రెండు పార్టీలకు  కంచు కోటగా కామారెడ్డి ఉండే ది. కామారెడ్డి నియోజక వర్గంలో గెలిచిన పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆనవాయితీ వస్తుంది.కొత్త అసెంబ్లీ  నియోజక వర్గం ఏర్పాటయితే తమకు అనుగుణంగా ఉన్న మండలాలపై నాయకుల్లో అంతర్మథనం మొదలైనట్లు సమాచారం. టిఆర్‌ఎస్ పార్టీకి అనుగుణంగానే నియో జక వర్గాలు ఏర్పాటు కానున్నాయని రాజ కీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.ఏదేమైనా కొత్త అసెంబ్లీ నియోజక వర్గం జరిగినట్లయితే రాజకీయ నాయకులకు కలిసి వస్తుందో లేదో అనే ఆందోళన మొదలైంది. దోమకొండకు అసెబ్లీ నియోజక వర్గం ఏర్పాటు కావాల్సిన మౌళిక వసతులతో పాటు కేసీఆర్ పూర్వికుల మండలం కావడంతో దోమకొండకే మెండుగా అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.కామారెడ్డి జిల్లాలో ఒక నియో జక వర్గంపెంపు ప్రతిపాదన దోమకొండకు కలిసి వచ్చే అంశంగా మారింది.

Comments

comments