Home స్పెషల్ ఆర్టికల్స్ ‘ఎపికి ప్రత్యేకహోదా విషయంలో బిజెపి మోసం చేసింది’

‘ఎపికి ప్రత్యేకహోదా విషయంలో బిజెపి మోసం చేసింది’

Kancha-Ilaiah

అమరావతి: ఎపికి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి బిజెపి మోసం చేసిందని ప్రొఫెసర్, ప్రముఖ రచయిత కంచె ఐలయ్య విమర్శించారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… 2019 ఎన్నికల్లో బిజెపికి ఎక్కడా సీట్లు రాకూడదని కోరుకుంటున్నానని అన్నారు. గత అక్టోబర్ ప్రభుత్వం తనను విజయవాడ రానీయకుండా చేసిందని మండిపడ్డారు. దళిత, బహుజన మేధావులు రాజకీయ శక్తి నిర్మాణం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రత్యేకహోదా ఉద్యమంతో పాటు సామాజిక న్యాయంపై కూడా పోరాటం జరగాలని ఐలయ్య సూచించారు. అంబానీ కంపెనీల్లో ఎస్ సి, ఎస్ టి, బిసిలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. అమరావతిలో ఎస్ సి, ఎస్ టి, బిసిలకు రిజర్వేషన్లు ఇవ్వాలని పేర్కొన్నారు. తెలంగాణలో టిమాస్ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎపిమాస్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకం ఇటీవల ఎంతటి వివాదస్పదమైందో తెలిసిందే. దీంతో ఆర్యవైశ్యులు ఆయనపై భగ్గుమన్నారు. ఈ పుస్తకానికి వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం విదితమే.