Home తాజా వార్తలు కాంచ‌న 3 ట్రైల‌ర్ విడుద‌ల

కాంచ‌న 3 ట్రైల‌ర్ విడుద‌ల

Kanchana-3

రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘కాంచన 3’. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో ఏప్రిల్ 19న విడుదలకానుంది. అయితే ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సందర్భంగా రాఘవ లారెన్స్ మాట్లాడుతూ “ముని సిరీస్ చిత్రాలన్నీ సూపర్ హిట్ కావడం థ్రిల్లింగ్‌గా ఉంది. ఇప్పుడు 4వ పార్ట్‌గా వస్తున్న ‘కాంచన 3’ కూడా ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. దేవుని అనుగ్రహంతో, ప్రేక్షకుల ఆదరణతో 10 పార్ట్‌ల వరకు తీయాలనేది నా బలమైన కోరిక. అలాగే తెలుగులో చిరంజీవి, నాగార్జునతో సినిమాలు చేయాలనుంది. నాకు కొరియోగ్రాఫర్‌గా లైఫ్ ఇచ్చిన చిరంజీవికి, దర్శకుడిని చేసిన నాగార్జునకు ఈ సందర్భంగా ధన్యవాదాలు చెబుతున్నాను.

ఇక బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్ హీరోగా నా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘కాంచన’ రీమేక్ వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. ఇదిలాఉండగా మా ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు 160 మంది చిన్న పిల్లలకు హార్ట్ సర్జరీ చేయించాం. 60 మంది పేద పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాం. ఈ విషయంలో ఎవరైనా అవసరార్థులు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. త్వరలో జరుగబోయే ‘కాంచన 3’ ఆడియో ఫంక్షన్‌లో మా ట్రస్ట్ గురించి ఇక్కడ తెలియజేస్తాను”అని అన్నారు. డిస్ట్రిబ్యూటర్ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ “ముని సిరీస్ చిత్రాలు అన్నింటికంటే వంద రెట్లు ఎక్కువగా ఈ సినిమా కంటెంట్ ఉంటుంది. ‘కాంచన 3’ కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలుస్తుంది”అని తెలిపారు. భారీ అంచనాలతో వస్తున్న ‘కాంచన 3’ పెద్ద విజయాన్ని అందుకుంటుందని ఠాగూర్ మధు చెప్పారు.

Kanchana 3 official trailer released