Home ఛాంపియన్స్ ట్రోఫీ హైదరాబాద్‌లో హర్రి‘కేన్’.. ఎస్‌ఆర్‌హెచ్ : 191/4

హైదరాబాద్‌లో హర్రి‘కేన్’.. ఎస్‌ఆర్‌హెచ్ : 191/4

Dhawan-Kane

హైదరాబాద్ : ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆటగాడు కేన్ విలియంసన్ చెలరేగిపోయాడు. 51 బంతుల్లో 5 సిక్సులు, 6 ఫోర్లతో 89 పరుగులు చేసి ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్ జట్టుతో ఆదిలోనే కెప్టెన్ డేవిడ్ వార్నర్ (4) వికెట్ కోల్పోయింది. దీంతో మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (70), విలియంసన్‌తో కలిసి మంచి భాగస్వామ్యంతో జట్టుకు మంచి స్కోర్ అందించారు. 148 పరుగలు వద్ద విలియంసన్ క్యాచ్ ఔట్ రూపంలో వెనుదిరగగా. 170 పరుగుల వద్ద ధావన్ ఔట్‌అయ్యాడు. చివర్లో హెర్నిక్యూస్ పరుసగా బౌండరీలు బాదటంతో నిర్ణీత 20 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ 4 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలింగ్‌లో క్రిస్ మోరిస్ 4 వికెట్లు తీశాడు.