Home వార్తలు మాఫియా డాన్‌గా కంగన

మాఫియా డాన్‌గా కంగన

kangana‘సిమ్రాన్’ అనే బాలీవుడ్ మూవీలో నటిస్తోంది కంగనా రనౌత్. ఈ సినిమాలో ఎన్నారైగా, లేడీ డాన్‌లా ఈ బ్యూటీ కనిపించనుంది. ఓ అమాయక యువతి… మాఫియా చేతుల్లో చిక్కుకొని ఎలా మాఫియా ప్రపంచంలో నిలదొక్కుకుందన్న కథాంశంతో ‘సిమ్రాన్’ సినిమా తెరకెక్కుతోందట. ఈ సినిమా కోసం ముందుగా రెండు గెటప్స్‌ను అనుకున్నారు. ఓ గెటప్‌లో హౌస్ కీపింగ్ చేసే మహిళగా కంగన కనిపించనుంది. దీనికోసం ఈ  భామ పెద్దగా కసరత్తులు చేయాల్సిన అవసరం రాలేదట. ఇంకో పాత్ర కోసం మాత్రం కంగన చాలా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసిందట. లేడీ డాన్ లుక్ కోసం ఆమె నానా తంటాలు పడిందట. కంగన గతంలోనూ ఈ తరహా గెటప్‌లో కనిపించినా… ‘సిమ్రాన్’లో ఆమె డాన్ గెటప్ ఇంకా డిఫరెంట్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ రెండు గెటప్‌లకు తోడు ఇంకో నాలుగైదు గెటప్స్ ఉంటాయని, అవన్నీ సినిమాలో కాసేపు మాత్రమే కనిపిస్తాయని తెలిసింది. కంగన అంటే ఒకప్పుడు గ్లామరస్ తార మాత్రమే. కానీ ఇప్పుడు బాలీవుడ్‌లో ఆమె మంచి నటిగా రాణిస్తోంది. పలు అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. గ్లామర్  రోల్ అయినా డీ గ్లామర్ రోల్ అయినా కంగన నటిస్తే సినిమా హిట్టవ్వాల్సిందే…. విమర్శకుల ప్రశంసలు అందుకోవాల్సిందే. అలా బాలీవుడ్‌లో కంగన హవా నడుస్తోందిప్పుడు. ‘సిమ్రాన్’తో ఈ భామ మరోసారి అవార్డుల్ని కొల్లగొట్టడం ఖాయమంటోంది చిత్ర బృందం. ఇక తెలుగులో కంగన ‘ఏక్ నిరంజన్’ సినిమాలో నటించింది.