Home వార్తలు కంగన చాలా తెలివైనది

కంగన చాలా తెలివైనది

kanganaబాలీవుడ్‌లో ఎంట్రీనిచ్చినప్పటి నుంచి ఏదో వివాదంలో చిక్కుకోవడం ఆమెకు అలవాటు. అయితేనేం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదగడమే కాదు… మూడు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఆ అందాల తారే కంగనారనౌత్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ భామ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుందని డైరెక్టర్ ఆనంద్ ఎల్.రాయ్ పేర్కొన్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్ మూవీలు కంగనకు ఎంతో పేరును తీసుకొచ్చాయి. కంగన గురించి ఆనంద్ మాట్లాడుతూ “గత ఐదారేళ్లలో కంగన ఎంతో పరిణతి చెందింది. ఇతర హీరోయిన్ ఎవరూ ఈ స్థాయిలో పైకి ఎదగలేకపోయేవారు”అని చెప్పారు. ఇక కంగనపై హీరో హృతిక్ రోషన్ వ్యాఖ్యలు చేయడంపై కూడా ఆయన స్పందిస్తూ… ఒకరి వ్యక్తిగత జీవితంపై మరొకరు కామెంట్లు చేయడం ఏంటని హృతిక్‌ను ఉద్దేశించి మాట్లాడాడు. ఈ వివాదంపై తాను కంగనతో ఎప్పుడూ టచ్‌లో ఉన్నానని, కానీ సలహాలు మాత్రం ఇవ్వలేదన్నాడు. కంగన చాలా తెలివైన హీరోయిన్ అని, స్వతహాగా తాను మంచి నిర్ణయాలు తీసుకోగలదని డైరెక్టర్ ఆనంద్‌రాయ్ అభిప్రాయపడ్డాడు. ఇద్దరు సెలబ్రిటీల మధ్య మాత్రమే కాదు సాధారణ వ్యక్తుల మధ్య కూడా వివాదాలు తలెత్తుతాయని, కానీ కంగన ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశాడు.