Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

ఆయనతో అలాంటిదేమి లేదు..!?

Kangana Ranaut denies rumours on Director Krish

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో రాధా క్రిష్ణ జాగర్లమూడి అదేనండి క్రిష్ ముందు వరుసలో ఉంటారు. ‘గమ్యం’ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన క్రిష్ అనతికాలంలోనే మంచి ప్రతిభ గల దర్శకుడిగా పేరు సంపాదించారు. వరుణ్ తేజ్ తో తీసిన ‘కంచె’ మూవీ క్రిష్ దర్శకత్వ పటిమను తెలిపింది. ఆ తరువాత సీనియర్ హీరో బాలకృష్ణతో చేసిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఆయన్ను ఓ మెట్టు పైకి ఎక్కించింది. అతి తక్కువ కాలంలో అద్భుత దృశ్యకావ్యంగా శాతకర్ణిని మలిచారు క్రిష్. దీంతో ఆయన పనితనానికి టాలీవుడ్ ఫిదా అయిపోయింది. ఇక తెలుగులో మంచి పేరు సంపాదించి హిందీ చిత్రసీమ బాలీవుడ్ లోనూ సినిమాలు తీసిన ఈ తరం దర్శకుల్లో క్రిష్ ఒకరు. అతను ఇంతకుముందే బాలీవుడ్ యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్ హీరోగా ‘గబ్బర్’ అనే మూవీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అది అంతగా ఆడకపోయినా క్రిష్ దర్శకత్వ ప్రతిభపై నమ్మకంతో బాలీవుడ్ లో మరో సూపర్ అవకాశం వచ్చింది. ఈసారి ‘మణికర్ణిక’ లాంటి మెగా ప్రాజెక్టును దక్కించుకున్నారు. రూ. 100 కోట్లకు పైగా భారీ బడ్జెతో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ లాంటి స్టార్ కథనాయికతో అతడు ఈ చిత్రాన్ని చేస్తున్నారు.

అయితే, అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే ఈపాటికే ఈ మూవీ విడుదల కావాల్సింది. కానీ అనివార్య కారణాలతో చిత్రం వాయిదా పడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో క్రిష్, కంగనాలపై సోషల్ మీడియా వేదికగా రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. ‘మణికర్ణిక’ ఔట్ పుట్ విషయంలో చిత్ర నిర్మాతలతో పాటు హీరోయిన్ కంగనా సంతృప్తిగా లేరని, అందుకే రీషూట్లు చేస్తున్నారనే గుసగుసలు వినిపించాయి. అంతేగాక డైరెక్టర్ క్రిష్ ప్రమేయం లేకుండానే ఈ రీషూట్లు జరుగుతున్నాయని బొగ్గాట. ఈ విషయమై కంగనకు, క్రిష్‌కు విభేదాలు కూడా తలెత్తాయని, ఇలా రకరకాల ఊహాగానాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, క్రిష్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా బాలకృష్ణ ‘యన్.టి.ఆర్’ చిత్రంతో బిజీగా ఉన్నారు. అయితే, ఈ రూమర్లపై కథనాయిక కంగనా స్పందించింది. అందరు అనుకుంటున్నట్లు క్రిష్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆమె స్పష్టం చేసింది. తాను, క్రిష్ ‘మణికర్ణిక’ విషయంలో ప్రతి రోజూ మాట్లాడుకుంటున్నామని తెలిపింది. అలాగే ‘మణికర్ణిక’ చిత్రాన్ని జనవరి 26న విడుదల చేయాలని అనుకున్నామని, కానీ అదే నెలలో క్రిష్ తెలుగు మూవీ రిలీజ్ కావాల్సి ఉందని చెప్పుకొచ్చింది. దీంతో ఆ సినిమాకు క్రిష్ డేట్లు కేటాయించడంతో ‘మణికర్ణిక’పై దృష్టి పెట్టలేకపోతున్నారని కంగనా వెల్లడించింది. ‘మణికర్ణిక’ను వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల చేద్దామనే ఆలోచన కూడా ఉందని ఆమె వివరించింది. ప్రస్తుతం ‘మణికర్ణిక’ సీజీ వర్క్ జరుగుతుందని చెప్పింది. కాగా, ప్రస్తుతం తాను ప్రకాష్ కోవెలమూడితో ‘మెంటల్ హై క్యా’ మూవీ చేస్తున్నట్లు తెలిపింది.

Comments

comments