Home సినిమా తన బయోపిక్‌కు తానే దర్శకత్వం!

తన బయోపిక్‌కు తానే దర్శకత్వం!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రనౌత్ ‘మణికర్ణిక’ చిత్రంతో పెద్ద హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. అయితే చిత్ర దర్శకుడు క్రిష్, కొంత మంది నటీనటులు ఆమె ప్రవర్తన పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడంతో విమర్శల పాలైంది. కంగన కెరీర్‌లో ఇలాంటివి కొత్తేమీ కాదు. ఎంతో మంది స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్ తాజాగా తన బయోపిక్‌ను తీసేందుకు సిద్ధమవుతోంది. తన బయోపిక్‌కు తానే దర్శకత్వం వహించబోతోంది.

ఇక ‘మణికర్ణిక’ చిత్రానికి రచనా సహకారాన్ని అందించిన విజయేంద్ర ప్రసాద్ ఆమె బయోపిక్‌కు కూడా రచనా సహకారాన్ని అందించబోతున్నారట. కంగన కెరీర్ ఆరంభం నుండి ఎదుర్కొన్న చేదు సంఘటనలను ఈ బయోపిక్‌లో పొందుపర్చ బోతున్నట్లు తెలిసింది. మామూలుగానే ఫైర్ బ్రాండ్ అయిన కంగనారనౌత్ ఈ బయోపిక్‌లో మరెంతగా బాలీవుడ్ స్టార్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేస్తుందో అంటూ కొందరు ఇప్పటి నుండే టెన్షన్ పడుతున్నారు.

Kangana Ranaut directed her Biopic