Home తాజా వార్తలు వీరనారి ఝాన్సీ రాణిగా మెరిసిన కంగన

వీరనారి ఝాన్సీ రాణిగా మెరిసిన కంగన

Kangana Ranaut In Manikarnika Movie

ముంబయి: విభిన్న కథలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ నటిస్తున్న చిత్రం మణికర్ణిక. ఈ చిత్రం వీరనారి ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ చిత్ర టీజర్ ను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. భారత తొలి స్వాతంత్య్ర సంగ్రామంగా పేరొందిన 1857 సిపాయిల తిరుగుబాటు కాలం నాటి నేతల్లో ఒకరైన వీరనారి ఝాన్సీ రాణి పాత్రలో కంగనా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో కంగన స్టిల్‌ను విడుదల చేసింది. ఇందులో ఆమె ఎరుపు వర్ణం చీరలో, భారీ నగలు ధరించి ఝాన్సీ రాణి గెటప్‌లో మెరిసిపోయారు. సోషల్ మీడియాలో ఆమె స్టిల్‌కు విపరీతమైన స్పందన లభించింది. క్వీన్‌గా కంగన సరిపోయారని మెచ్చుకున్నారు.క్‌ చాలా బాగుంది ఆల్‌ ది బెస్ట్‌, మనసు దోచుకున్నావ్‌..’ అంటూ తెగ కామెంట్లు చేశారు. ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది.  క్రిష్‌ దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్‌కు కంగన దర్శకత్వం వహించారు. క్రిష్‌  ఎన్ టిఆర్ బయెఫిక్ తో బిజీగా ఉండటంతో ఆమె ఈ బాధ్యతల్ని తీసుకున్నారు.