Home తాజా వార్తలు ఆది యోగి శివ సన్నిథిలో కంగనారనౌత్

ఆది యోగి శివ సన్నిథిలో కంగనారనౌత్

Kangana Seeks Blessings of adiyogi shiva

చెన్నై: బాలీవుడ్ హీరోయిన్ కంగనారనౌత్ ప్రస్తుతం ‘మెంటల్ హై క్యా’, ‘మణి కర్ణిక’ వంటి భారీ చిత్రాల్లో నటిస్తుంది. రాజ్‌కుమార్ రావుతో నటిస్తున్న మెంటల్ హై క్యా షూటింగ్ లండన్‌లో పూర్తి చేసుకుంది. షూటింగ్ పూర్తయ్యాక తర్వాత కంగనా భారత్ తిరిగి వచ్చింది. అయితే ఆమె చేస్తున్న మరో సినిమా క్వీన్. కంగనా ప్రస్తుతం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.  కోయంబత్తూర్‌లోని ఆదిశక్తి ఆశ్రమంలోని ధాన్యలింగ సన్నిధానానికి ఆమె వెళ్లింది. ఆదియోగి శివుని ఆశీస్సులు తీసుకుంది. అనంతరం లార్డ్ శివ విగ్రహం ముందు నిలబడి దిగిన ఫొటోతోపాటు శివుని సన్నిధానంలో ఉన్న ఫొటోలను ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా తన అభిమానులతో కంగనా పంచుకుంది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Kangana Seeks Blessings of adiyogi shiva