Home తాజా వార్తలు అత్యాచారం కేసు: కంగనా హెయిర్‌స్టైలిస్ట్‌ అరెస్ట్..!

అత్యాచారం కేసు: కంగనా హెయిర్‌స్టైలిస్ట్‌ అరెస్ట్..!

Kangana Ranaut's hairstylist arrested for raping minor

ముంబయి: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హెయిర్‌స్టైలిస్ట్‌గా పనిచేస్తున్న సౌతాఫ్రికాకు చెందిన బ్రెండ‌న్ అలెస్ట‌ర్ డిగీ(42)ని ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్ బాలుడిపై సలింగ అత్యాచారానికి పాల్పడినట్లు డిగీపై ఆరోపణల నేపథ్యంలో మణికర్ణిక షూటింగ్ స్పాట్ లోనే  పోలీసులు అతడిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే… డిగీ ఓ డేటింగ్ యాప్ ద్వారా ఒక మైనర్ బాలుడితో పరిచయం ఉంది. సదరు పదహరేళ్ల బాలుడు యాప్ ద్వారా పురుష సెల‌బ్రిటీల‌తో రిలేష‌న్స్ పెట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో ఒక రోజు బాలుడి తల్లి అది గ‌మ‌నించి నిలదీసింది. దాంతో తన కొడుకుతో సంబంధాలు పెట్టుకున్న 8 మందిలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు చేసిన ఎనిమిది మందిలో బ్రెండన్ కూడా ఉన్నాడు. దాంతో ప్రస్తుతం మణికర్ణిక చిత్ర షూటింగ్ జరుగుతున్న మ‌హారాష్ట్ర‌లోని రాయ‌గ‌ఢ్‌ జిల్లాలో డిగీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. కాగా, కంగ‌నాతో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా బ్రెండ‌న్ హెయిర్‌స్టైలిస్ట్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.