Home తాజా వార్తలు ‘మణికర్ణిక’ ట్రైలర్: అదరగొట్టిన కంగనా

‘మణికర్ణిక’ ట్రైలర్: అదరగొట్టిన కంగనా

 

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన చిత్రం ‘మణికర్ణిక..ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితాధారంగా ఈ చారిత్రక చిత్రాన్ని క్రీయేటీవ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించారు. భారీ బ‌డ్జెట్‌తో జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కాగా, కొంత ప్యాచ్ వ‌ర్క్ కంగ‌నా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందింది. అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా విడుద‌ల చేసిన చిత్ర టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. యుద్ధ విద్యలో ఝాన్సీ లక్ష్మీబాయి ఆరితేరడం, గుర్రపు స్వారిలో నైపుణ్యాన్ని కనబరచడం, వివాహం..భర్తను కోల్పోవడం, బ్రిటీష్ సైన్యంపై యుద్ధం చేయటం వంటి సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ట్రైల‌ర్‌తో మూవీపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంగీత త్రయం శంకర్- ఎహసాన్-లాయ్ లు సంగీతం అందించారు. కాగా, ఈ చిత్రం వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకానుంది.

 

 

Kangana’s Manikarnika Trailer released