Saturday, April 27, 2024

కాంగ్రెస్‌లో చేరుతారా?

- Advertisement -
- Advertisement -

Kanhaiya Kumar meets Rahul Gandhi

రాహుల్‌తో కన్హయ్య భేటీ

న్యూఢిల్లీ: జెఎన్‌యూ మాజీ విద్యార్థి నేత, ఇప్పుడు సిపిఐలో ఉన్న కన్హయ్య కుమార్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. విద్యార్థి నేతగా సంచలనం సృష్టించిన కన్హయ్య కాంగ్రెస్‌లో చేరుతారని వార్తలు వెలుడుతున్నాయి. ఈ దశలో రాహుల్‌తో ఆయన సమావేశం నిర్వహించడం కీలకం అయింది. తన కమ్యూనిస్టు భావజాలానికి అనుగుణంగా కన్హయ్య సిపిఐలో చేరినప్పటికీ కొంతకాలంగా ఆ పార్టీలో విసిగిపోతున్న దశలో ఉన్నారు. రాజకీయంగా ఎటువంటి ఎదుగుబొదుగు స్థితిని ఎదుర్కొంటున్నారు. రెండు మూడు రోజుల క్రితమే ఆయన రాహుల్‌ను కలిసినట్లు వెల్లడైంది. ఆయన తమ పార్టీ వీడనున్నారనే వార్తలపై సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా స్పందించారు. ఈ విషయంపై పలు ఊహాగానాలను తాను విన్నానని తెలిపారు.

అయితే ఇప్పటికీ ఆయన తమ పార్టీలోనే ఉన్నారని, ఈ నెలలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ భేటీకి హాజరయ్యారని, చర్చలలో కూడా పాల్గొన్నారని, ఇంతకు మించి ఎక్కువగా చెప్పలేననితెలిపారు. రాహుల్‌తో భేటీ అంశం గురించి వివరణ ఇచ్చేందుకు కన్హయ్య నిరాకరించారు. బీహార్ రాజకీయాలలో తాను కీలక పాత్ర పోషించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అయితే బీహార్‌లో మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ రాజకీయ బలహీనతతో కొట్టుమిట్టాడుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో 70 స్థానాలలో పోటీ చేయగా కేవలం 19 సీట్లనే దక్కించుకుంది. పైగా ఆర్జేడీ సారథ్యపు కూటమి విజయావకాశాలను దెబ్బతీసిన పార్టీగా నిలిచింది. గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మెవానీ కూడా ఇటీవల రాహుల్‌ను కలిశారు. ఓ వైపు కాంగ్రెస్ నుంచి ఇటీవలి కాలంలో యువ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, సుష్మితా దేవ్, జితన్ ప్రసాద , ప్రియాంక చతుర్వేది వంటి వారు నిష్క్రమించిన దశలో వెలుపలి యువ శక్తులు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధపడటం కీలక పరిణామం అయింది. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అదే విధంగా అత్యంత కీలకమైన రాజకీయ ప్రాబల్యపు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్‌కు ఇటీవలి కాలంలో అందని ద్రాక్ష అయిన దశలో ఆ రాష్ట్రంపై కూడా రాహుల్ ప్రత్యేకించి ప్రియాంక ఎక్కువగా దృష్టి సారించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News