Home వనపర్తి తాగునీటికై కన్నీళ్లు పెడుతున్న కనిమెట్ట

తాగునీటికై కన్నీళ్లు పెడుతున్న కనిమెట్ట

Drinking-Water-Problem

మోటార్‌లు పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్న కనిమెట్ట గ్రామస్థులు
ఎంఎల్‌ఎ సహకారంతో మూడు బోర్లు వేయిస్తాం
గ్రామంలో తాగునీరు సమస్య లేకుండా పరిష్కరిస్తాం

కొత్తకోట: మండల పరిదిలోని కనిమెట్ట గ్రామానికి రామన్‌పాడ్ త్రాగునీరు సరఫరా కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. రామన్‌పాడ్ నుండి గ్రామానికి సరఫరా అయ్యే త్రాగు నీరు 2 నెలలు అవుతున్న సరఫరా బంద్ కావడంతో ఆర్‌డబ్లుఎస్ డిఈ , ఎఈలు నిర్లక్షంతో వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి సరపరా అయ్యే గ్రామ సమీపంలో గల త్రాగునీటి బావి నుండి ఐదు రోజులు త్రాగునీరు సరపరా కావడం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనిమెట్ట గ్రామంలోని ప్రజలకు తాగునీరు సమస్యలను పరిష్కరించడానికి ఎంఎల్‌ఎ సహకారంతో మూడు నూతన బోరు బావులు వేయించి త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని సర్పంచ్ సుమిత్ర పెంటన్నలు తెలిపారు.

 గత ఐదు రోజులుగా గ్రామంలో త్రాగునీరు సమస్య తీవ్రంగా ఉందన్నమాట వాస్తవమే. కనిమెట్ట అనుబందగ్రామం జంగమాయపల్లి గ్రామ సమీపంలో గల వాగులో తాగునీటి బావిని ఏర్పాటు చేయడం జరిగింది . కాని సరళాసాగర్ పైపు లైన్‌లు రిపేరు కావడంతో బ్యాక్ వాటర్ లేనందున గ్రామానికి త్రాగునీరు సమస్యలు ఉన్న వాస్తమేనని జిల్లా కలెక్టర్, ఎంఎల్‌ఎ ఆల వెంకటేశ్వర్ రెడ్డిల సూచనల మేరకు 15 మందితో త్రాగునీటి సమస్య తీర్చడానికి బావి ని మరమ్మత్తు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ప్రస్తుతం క్రేన్ తెప్పించి 12 మందితో 5 రోజుల పాటు త్రాగునీటి బోరు బావిని మరమ్మత్తు చేయడం జరుగుతుందని త్వరలో పనులు పూర్తయి గ్రామ ప్రజలకు త్రాగునీరు అందిస్తామని సర్పంచ్ సుమిత్ర పెంటన్న తెలిపారు.

గ్రామంలో త్రాగునీటి సమస్యపై జిల్లా కలెక్టర్ శ్వేతామహంతికి పిర్యాదు చేసిన వెంటనే ప్రత్యేకాధికారులను గ్రామానికి పంపించి త్రాగునీటి సమస్యల పరిస్కారానికి నిధులు కెటాయించి పలు సూచనలు చేశారని సర్పంచ్ తెలిపారు. అంతేకాకుండా దేవరకద్ర ఎంఎల్‌ఎ సహాకారంతో గ్రామంలో అవసరం ఉన్న చోట నూతన బోర్లను వేయించి
త్రాగునీటి సమస్యలను అదిగమిస్తామని ఆమె తెలిపారు.