Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

గుండెపోటుతో నటుడు మృతి

Dhruv-sharma

కన్నడ నటుడు, క్రికెటర్ ధృవ్ శర్మ (35) గుండె పోటుతో మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయనకు భార్య , ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ధృవ్ శర్మకు సోమవారం రాత్రి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ను బెంగళూరులోని కొలంబియా ఆసియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున చనిపోయారు. ధృవ్ శర్మ అకాల మరణంపై బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్, హీరోయిన్ ప్రియమణి, ఇతర కన్నడ నటులు సంతాపం తెలిపారు. వినికిడి, మాట బలహీనత ఉన్నా, కన్నడ చిత్ర సీమతో పాటు క్రికెట్‌లో కూడా ధృవ్‌శర్మ రాణించారు. ఆయన లిమ్కా బుక్ రికార్డ్‌లో కూడా స్థానం సంపాదించారు. 2005లో డెఫ్ వరల్డ్ క్రికెట్ కప్‌లో భారత తరపున ఆయన ఆడారు.

Kannada actor-cricketer Dhruv Sharma passes away

Comments

comments