Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

మెగాస్టార్ మూవీలో సుదీప్

Sudeep

కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ ‘ఈగ’ చిత్రంతో టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. అనంతరం బాహుబలి చిత్రంలో తన అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ప్రస్తుతం ఈ కన్నడ స్టార్‌కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు సుదీప్ మరో తెలుగు సినిమాలో నటించబోతున్నాడని సమాచారం. అది కూడా చిరంజీవి కొత్త సినిమా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’లో అతను నటిస్తాడని తెలిసింది. కొణిదెల ప్రొడక్షన్స్‌పై రామ్‌చరణ్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించనున్నాడు. ఈ సినిమాలో ఇప్పటికే అమితాబ్ వంటి బాలీవుడ్ బిగ్ స్టార్ భాగమవుతున్నాడని తెలిసింది. అలాగే స్టార్ బ్యూటీ నయనతార కూడా ఈ సినిమా కోసం సిద్ధమవుతోంది. ఇప్పుడు చిత్ర యూనిట్ ఓ ముఖ్యమైన పాత్ర కోసం సుదీప్‌తో సంప్రదింపులు జరుపగా అతను ఓకే అన్నట్లు తెలిసింది. ఈ కన్నడ స్టార్ ఈ మూవీలో నటిస్తే ఈ సినిమాకు మరింత క్రేజ్  రావడం ఖాయం.

Comments

comments