Search
Friday 21 September 2018
  • :
  • :

పార్టీ పెట్టిన కన్నడ హీరో ఉపేంద్ర

UPENDRA-1బెంగళూరు : కన్నడ హీరో ఉపేంద్ర కర్నాటక ప్రాజ్ఞవంత్ జనతా పక్ష (కెపిజెపి) పేరుతో మంగళవారం పార్టీని స్థాపించారు. బెంగళూరులోని గాంధీభవన్‌లో ఈ పార్టీని ఆయన ఆవిష్కరించారు. తనది ప్రజల పార్టీ అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సమాజంలో మార్పు తీసుకరావడమే తన పార్టీ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు తాము పార్టీ పోరాడుతుందన్నారు. నవంబరు 10న పార్టీ వెబ్‌సైట్, యాప్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

Kannada Hero Upendra Start New Party

Comments

comments