Home సూర్యాపేట కన్నకూతురికి విషం, ఆత్త గోంతు కోసిన ఆల్లుడు

కన్నకూతురికి విషం, ఆత్త గోంతు కోసిన ఆల్లుడు

alludu

మన తెలంగాణ/చింతలపాలెం ః భార్య, భర్తల గొడవలతో కన్నకూతురికి తన తండ్రి సర్సింహారావు మానవత్వాన్ని చంపుకోని ఎలుకల మందు తపి తాను కుడా తాగి, అత్త గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండల పరిదిలోని తమ్మావరం గ్రామంలో చోటుచేసుకుంది. పోలిసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భార్య, భర్తల వివాదంలో 13 నెలల పాప నవ్యశ్రీకి పాలల్లో కన్నతండ్రే ఎలుకల మందు తాపాడు. భార్య గోడవలతో తమ ముద్దుల కుమారైకు పాలు తాపాల్సిన వయస్సులో కన తండ్రి విషం తాపాడని తెలిపారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు పాపను అసుపత్రికి తరలించారు ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో అత్త లక్ష్మితో గొడవపడి ఆమెగొంతు కొసి కౄర మృగంగా ప్రవర్తించాడని తెలిపారు. ఇది గమనించిన స్థానికులు, గ్రామస్తులు రక్తపు మడుగులలో ఉన్న లక్ష్మిని హుజూర్‌నగర్ లోని ప్రభుత్వ ధవాఖానాకు తరలించారు. ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యంకోసం హైద్రాబాద్ ధవాఖానాకు తరలించారు. కుమారై నవ్వశ్రీని మేళ్ళచెర్వు ప్రయివేటు ధవాఖానాలో వైద్యం చేయించారు. చిన్నపిల్ల పరిస్థితి విషమంగా ఉండటంతో కోదాడలోని దవాఖానాకు తరలించారు. నర్సింహారావు కూడా విషం తాగడంతొ హుజూర్‌నగర్ దవాఖానాలో వైద్యం చేయించారు. ఇతని పరిస్తితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వీరికి సుమారు 5 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది బతుకుదేరువుకోసం మేళ్ళచెర్వు సువర్ణ సిమెంట్ పరిశ్రమలో సెక్యూరిటి గార్డ్‌గా పనిచేస్తు జీవనం సాగిస్తున్నాడు. వీరిద్దరు కలిసి తమ్మారం గ్రామంలో ఆత్తగారి ఇంట్లో 2 రోజులు ఉండటానికి వచ్చి ఇలా జరగటం ఆ గ్రామంలొ విషాదాన్ని చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్సింహారావును అదుపులోకి తీసుకున్నట్లు ఎసై పరమేష్ తెలిపారు.