Home తాజా వార్తలు ఆగస్టు15 నుంచి తెలంగాణకు ‘కంటి వెలుగు’

ఆగస్టు15 నుంచి తెలంగాణకు ‘కంటి వెలుగు’

kanti velugu launch on August 15

హైదరాబాద్: తెలంగాణలో ఆగస్టు 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ‘కంటి వెలుగు’ పథకాన్ని ప్రారంభించనుంది. ‘అంధత్వ రహిత తెలంగాణ’ దిశగా చేపట్టిన ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేయనుంది తెలంగాణ సర్కార్. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఉచిత కంటి పరీక్షలు జరపనున్నారు. అలాగే, కళ్లద్దాలు, మందుల పంపిణీతో పాటు అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నారు. అయితే ఈ పథకం వివరాలను గవర్నర్‌ నరసింహన్‌ ఇదివరకే వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు.