Home తాజా వార్తలు కెసిఆర్ కడుపు సల్లగుండాలే

కెసిఆర్ కడుపు సల్లగుండాలే

'Kanti Velugu' program gets huge response

కంటి వెలుగు శిబిరాలకు అనూహ్య స్పందన

జగిత్యాల: కంటి జబ్బులతో బాధపడుతున్న వారికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు, కంటి అద్దాలు, శస్త్ర చికిత్సలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు పథకం శిబిరాలకు అనూహ్యా స్పందన లభిస్తుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రామాల్లో కంటి వెలుగు పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 18 మండలాల్లోని గ్రామాల్లో, ఐదు మున్సిపాల్టీల్లోని వార్డులో సాగుతున్న కంటి పరీక్షలకు జనం తరలివస్తున్నారు. శుక్రవారం 9628 మందికి కంటి పరీక్షలు నిర్వహించి అందులో 1483 మందికి కంటి అద్దాలను అందజేశారు. అలాగే 1070 మందిని శస్త్ర చికిత్సల కోసం ఎంపిక చేశారు. శని, ఆదివారాల్లో సెలవుదినం కాగా సోమవారం నిర్వహించిన కంటి వెలుగు శిబిరాలకు వర్షం కారణంగా పెద్దగా జనం రాలేదు. కంటి పరీక్షలు నిర్వహించుకుంటున్న ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కెసిఆర్ పుణ్యమా అని… కం టి జబ్బులతో బాధపడుతున్న తమకు పైసా ఖర్చు లేకుం డా కంటి అద్దాలు, మందులు అందించారని, కళ్లు పూర్తి గా కనిపించని వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని చెబుతున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పేదలకు మేలు : విజయ, ఎంపిపి, మల్లాపూర్
కంటి వెలుగు కార్యక్రమం ద్వారా పేదలకు ఎంతో మేలు జరుగుతోంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు పరీక్షలకు జనం భారీగా తరలివస్తున్నారు. ఆర్థిక లేమితో ఆస్పత్రులకు వెళ్ళలేని ఎంతో మందికి ఈ కేంద్రాల ద్వారా ఉచితంగా మందులు, అద్దాలు అందుతున్నాయి. అవసరం ఉన్న వారికి ఆపరేషన్లు చేసేందుకు ఎంపిక చేస్తున్నారు. కంటి పరీక్షలు చేయించుకు న్న నాకు కూడా కంటి అద్దాలు వచ్చాయి. ప్రభుత్వం ఇస్తున్న అద్దాల నాణ్యత బాగుంది.

ఆలోచన బాగుంది : కీచులాటపల్లి
కంటి జబ్బులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వ పరంగా వైద్య సేవలు అందించాలనే ప్రభుత్వ ఆలోచన బాగుంది. ఎక్కడికి వెళ్ళకుండా ఊరిలోనే కంటి వెలుగు పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల మంచిస్పందన లభిస్తోంది. ఏ రోజు కేంద్రానికి రావాలో ముందుగానే డప్పు చాటింపు చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా అరగంటలో కంటి పరీక్షలు పూర్తవుతున్నాయి. ఇంత వరకు తనకు కంటి సమస్యలు లేవనుకున్నానని, కేంద్రానికి వెళ్ళి పరీక్ష చేయించుకోగా తనకు కంటి అద్దాలు అందజేశారు.

బాగా కనిపిస్తోంది : పుష్పలత, సారంగాపూర్
కంటి వెలుగులో భాగంగా కంటి పరీక్ష చేయించుకోగా తనకు కొంత దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించిన వైద్యులు కళ్ళద్దాలు అందజేయడంతో గతంలో కంటే బాగా కనిపిస్తోంది. కంటి అద్దాల నాణ్యత బాగుంది. కంటి వెలుగుతో నా లాంటి వారికి ఎందరికో లబ్ది చేకూరుతోంది. పరీక్ష కేంద్రానికి వచ్చే వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇంతకు ముందు తమకు కంటి సమస్యలు లేవనుకున్న ఎంతో మందికి ఈ పరీక్షల ద్వారా సమస్యలు బయటపడుతున్నాయి. పైసా ఖర్చు లేకుండా మెరుగైన సేవలు అందుతున్నాయి.

రుణపడి ఉంటం :పెద్ద చిన్నారెడ్డి, నడికుడ
కెసిఆర్ పదికాలాల పాటు సల్లగుండాలే.. కెసిఆర్ పుణ్య మా అని నాకు మందులు, కళ్ళ అద్దాలు వచ్చినయి. ఊళ్ళేనే క్యాంపు పెట్టి డాక్టర్లు పరీక్షలు జేసుడుతోటి దిక్కు, దీము లేనోళ్ళకు పైసా ఖర్సు లేకుంట మందులు, అద్దాలు ఇత్తండ్రు. కండ్లు బాగా కనిపియ్యనోళ్ళకు ఆపరేషన్లు గూడా జెత్తరట. ఆపరేషండ్లు అవసరమున్నోళ్ళ పేర్లు రాసుకుంటండ్రు. ఇంతకు ముందు ఏ సర్కారు గూడా గిట్ల ఆలోచన జేయలే. కెసిఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటం.

సంతోషంగా ఉంది: గుజ్రీబాయి, నజీరాబాద్‌తండా (వికారాబాద్ జిల్లా-పరిగి):- తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కంటి వెలుగు పథం ద్వారా ఉచితంగా కంటి పరీక్షలు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. స్వయంగా వైద్యులే మా తండాకు వచ్చి కళ్లకు సంబంధించి అన్ని రకాల పరీక్షలు చేశారు. అంతేకాకుండా ఉచితంగా కళ్లులో వేసుకునేందుకు చుక్కల మందు, గోళీలు ఇచ్చారు. అంతేకాకుండా ఉచితంగా కళ్లద్దాలు ఇవ్వడంతో నాకు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది.

కంటి వెలుగయ్యాడు: గణపతి (వికారాబాద్ జిల్లా -పరిగి):- కంటి వెలుగు పథకం ద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్ వృద్ధులకు కంటి వెలుగయ్యాడు. చాలా మంది వృద్ధ్దులకు కంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారికి పట్టణాలకు తీసుకువెళ్లి వైద్యం చేయించలేని పరిస్థితుల్లో స్థానికంగా గ్రామాలు, తండాల్లో, మారుమూల ప్రాంతానికి వచ్చి వైద్యులు పరీక్షలు అందించడం చాలా సంతోషకర విషయం. అంతేకాకుండా కళ్లద్దాలు, మందులు ఉచితంగా ఇవ్వడంలో వృద్దుల అనందాని అవదులు లేవన్నారు.

పేదలకు వరం: దుర్గై సూర్యకాంత్, ఆదిలాబాద్:- ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు పేదలకు వరం. ఉచితంగా పరీక్షలు, అపరేషన్లు, కంటి అద్దాలు ఇస్తున్నారు. కెసిఆర్ సార్ ప్రజల సంక్షేమం కోసం ఇలాంటి పథకాలు మరెన్నో చేపట్టాలి.

ఉచిత సేవలు అందిస్తున్నారు: వాజీద్, ఆదిలాబాద్:- ఆత్యధునిక పరికాలతో కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేస్తున్నారు. అద్దాలు కూడా ఇస్తున్నా రు. అవసరమైతే అపరేషన్లు కూడా చేయిస్తున్నారు. ప్రైవేట్ దాదాపు 15 నుంచి 20వేల వరకు ఖర్చు అవుతుంది. అలాంటి పేదల కోసం ఉచితంగా చేయించడం ఆనందంగా ఉంటుంది. కెసిఆర్ సార్ సల్లంగా ఉండాలి.

ఇంటికి వెలుగు అయింది: బాపురావ్, ఆదిలాబాద్:- పేద కుటుంబంలో ఒకరిపై ఆధారపడి చాలా మంది జీవిస్తున్నారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తికి కంటి చూపు సమస్య వస్తే ప్రైవేట్‌లో చూపించుకునే స్థోమత లేకుండా ఇంట్లో ఉండేవారు. కానీ అలాంటి ఇంటికి వెలుగు నింపేందుకు సిఎం కెసిఆర్ ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. సిఎం కెసిఆర్‌కు ప్రజల తరపున కృతజ్ఞతలు.

కంటికి వెలుగు పథకం పేదలకు వరం: ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకం పేదలకు వరంగా మారింది. గతంలో ఎన్నోప్రభుత్వాలను,   చూసిన.ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిషలు పరితపించేది మాత్రం కెసిఆ రే నని చేప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గ్రామాల్లో కంటి సమస్యలతో ఎందరో సతమతమవుతున్నారు. అలాంటి వారికి ఈ పథకం ఎంతో మేలు చోస్తోంది. కంటి చూపు సమస్యతో అవస్థలు పడుతున్న వారికి ఈ కంటి వేలుగు వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపడం ఖాయం.