Home స్కోర్ ఇషాంత్ వికెట్లు తీసే నేర్పు సంపాదించుకోవాలి: కపిల్

ఇషాంత్ వికెట్లు తీసే నేర్పు సంపాదించుకోవాలి: కపిల్

kapilన్యూఢిల్లీ: నిలకడగా వికెట్లు తీసుకు నేలా బౌలింగ్ చేయ డం ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ నేర్చుకో వాలని భారత మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్ అభిప్రాయ పడ్డారు. చికెన్‌గున్యా కారణంగా న్యూజిలాండ్ సిరీస్‌ను మిస్సయిన ఇషాంత్ శర్మ బుధవారం నుంచి రాజ్‌కో ట్‌లో ఆరంభం కానున్న ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు తిరిగి జట్టులో చేరాడు. ఇషాంత్ శర్మ టెస్ట్ గణాంకాలు చూస్తే…అతడు 72 గేముల్లో 209 వికెట్లు తీసుకున్నాడు. అతడి స్ట్రయిక్ రేటు 66.6గా ఉంది. అంటే దాదాపు 11.5 ఓవర్లకు ఒక వికెట్ చొప్పున తీసుకున్నట్లవుతుంది. అందుకనే ఇషాంత్ శర్మ నిల కడగా వికెట్లు తీయడం నేర్చుకోవాలని కపిల్ భావిస్తున్నారు. ఇషాంత్ చాలా మంచి బౌలరేనని, కానీ వికెట్లు తీసుకునే నేర్పు వృద్ధి చేసుకోవాలని, కీలక సమయాల్లో అది చాలా అవసరమని కపిల్ అన్నారు. అతడిలో ప్రతిభకేమి కొదవలేకపోయినప్పటికీ వికెట్లు తీసుకునే నిలకడతనం అలవడాలన్నారు. భారత్-ఇంగ్లాండ్ సిరీస్ సందర్భం గా స్టార్ స్పోర్ట్ నిర్వహించిన చర్చలో ఆయన ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశా రు. ఇక కపిల్ రికార్డు చూస్తే…ఆయన 83 టెస్టుల్లో 300 వికెట్లు తీసుకున్నారు. లైన్ అం డ్ లెన్త్ బౌలింగ్‌లో ఇషాంత్ నిలకడగా బౌలింగ్ చేయాల్సి ఉందన్నారు. ఇటీవల సెలక్టర్ల చైర్మన్ అయిన ఎంఎస్‌కె ప్రసాద్ ఇటీవల ‘మరో కపిల్ దేవ్’ను వెతకాల్సి ఉందన్నారు. కపిల్ దేవ రిటైర్ అయి దాదాపు 22 ఏళ్లు అవుతోంది. ఆయన టెస్ట్ క్రికెట్‌లో 434 వికెట్లు తీసుకుని, 5,000కు పైగా పరుగులు చేశారు. ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్య తొలిసారి టెస్టులకు ఎంపికయిన విషయంపై కపిల్‌దేవ్ ప్రతిస్పందిస్తూ అన్ని విభాగాల్లో ఒకే రీతిలో రాణించడం అన్నది కష్టసాధ్యమన్నారు. నేడు క్రికెట్‌లో చాలా ఎదురుచూస్తున్నారన్నారు. గాయాలు అయ్యే అవకాశాలుంటాయి. సంవత్సరంలో 10 నెలలు ఆడాల్సి ఉంటుంది. అన్ని విభాగాల్లో ఆల్‌రౌండర్‌గా ఒకేరీతిలో రాణించడం అంత సులువేమి కాదని అన్నారు. హార్థ్దిక్ పాండ్యను మరో కపిల్‌దేవ్‌గా పరిగణించొచ్చా అని కపిల్‌ను ప్రశ్నించినప్పుడు ఆయన‘ మీరు మరో వ్యక్తి వెతకాల్సిన పనే లేదు. ప్రతి ఆటగాడికి తనదంటూ ఓ సత్తా ఉంటుంది. తానే పేరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. భారత్ జట్టుకు మరో సచిన్ టెండూల్కర్, మరో గవాస్కర్ దొరుకుతారా?’ అని ఆయన ఎదురు ప్రశ్నించారు. సరైన ఆటగాడిని ఎంపిక చేసి, అతడిని ఉత్తమ ఆటగాడిగా తీర్చిదిద్దాలని కపిల్ అన్నారు.