Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

కరీంనగర్ లో కలకలం

 

Kareeman in Karimnagar

ప్రియురాలి గొంతుకోసి హతమార్చిన ప్రియుడు                                                                                                            దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు
సంఘటనా స్థలాన్ని సందర్శించిన సి పి కమలాసన్‌రెడ్డి
నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలని బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్
నిందితుడిని ఎన్‌కౌంటర్ చేస్తారా లేక మాకు అప్పగిస్తారా
పోలీసులను నిలదీసిన బాధిత కుటుంబసభ్యులు సహా మహిళా నాయకురాళ్లు

కరీంనగర్ జిల్లా కేంద్రంలో కలకలం చెలరేగింది.కలెక్టరేట్  మీసేవ కేంద్రంలో శుక్రవారం జరిగిన ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ ప్రేమికుడు తన ప్రియురాలి గొంతు కోసి హతమార్చాడు. అనంతరం అతను కూడా ఆత్మహత్య చేసుకోవాలని చేసిన ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకుని అవేశంతో అతడికి దేహాశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.జరిగిన సంఘటన స్థలాన్ని చేరుకుని సిపి కమలాహసన్‌రెడ్డి వివరాలను అడిగి తెలుసుకున్నారు.మృతురాలు బంధువులు నిందితుని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళ నాయకురాళ్లు వంశీధర్‌ను మాకు అప్ప గిస్తారా లేకా ఎన్‌కౌంటర్  చేస్తారా అని పోలీసులను నిలదిశారు.

మనతెలంగాణ/కరీంనగర్‌ క్రైం: కరీంనగర్ జిల్లా కేంద్రంలో కలకలం చెలరేగింది. కలెక్టరేట్ ముఖ ద్వారం ఎదురుగా ఉన్నటువంటి ఓ మీసేవ కేంద్రంలో శుక్రవారం జరిగిన ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ ప్రేమికుడు తన ప్రియురాలి గొంతు కోసి హతమార్చాడు. అనంతరం అతను కూడా ఆత్మహత్య చేసుకోవాలని చేసిన ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకుని అవేశంతో అతడికి దేహాశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. విద్యావంతుడైన ఆ యువకుడు విచక్షణ మరిచి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ ప్రేమికుడిని కటకటాల పాలు చేసింది. వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని ప్రాంతానికి చెందిన ఊట్ల విష్ణువర్ధన్‌విజయల కుమార్తె అయినటువంటి ఊట్ల రోషిణి అలియాస్ రసజ్ఞ (22) స్వగ్రామంలో డిగ్రీ వరకు చదువుకుంది. ఆ సమయంలో ఆమెకు కాటారం మండలంలోని శంకరంపల్లి గ్రామానికి చెందిన సిరంగి వంశీధర్‌తో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారింది. అయితే గోదావరిఖని ప్రాంతంలోని ఓ మీసేవ కార్యాలయంలో రోషిణి పనిచేస్తుండగా వీరి ప్రేమాయణం గురించి ఇరుకుటుంబాల సభ్యులకు తెలిసింది. పంచాయతీ నిర్వహించిన పెద్దలు ఇక నుంచి ఒకరికొకరు కలుసుకోవద్దని లిఖితపూర్వకంగా రాసుకోవడం జరిగింది. రసజ్ఞ స్వగ్రామంలో ఉంటే ఏదైనా జరగవచ్చు అనే ఆలోచనతో ఆమె కుటుంబసభ్యులు ఆమెను కరీంనగర్‌కు పంపించగా ఆమె స్థానిక కలెక్టరేట్ ఎదురుగా ఉన్నటువంటి ఓ మీసేవ కేంద్రంలో పనికి కుదిరింది. కాగా ప్రియురాలిని మరిచిపోలేకపోయిన వంశీధర్ ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించగా పెద్దల నిర్ణయంతో భయపడిన రోషిణి అతనితో సరిగ్గా మాట్లాడకపోవడం ఫోన్ చేసిన సమయంలో కట్ చేయడం లాంటివి చేస్తుండేది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న వంశీధర్ తనకు దక్కని రోషిణి మరెవరికి దక్కకూడదని నిర్ణయించుకుని ఒక పథకం ప్రకారం ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. వేసుకున్న పథకం ప్రకారం ఓ కత్తిని వెంట తీసుకుని రోషిణి పనిచేస్తున్న మీసేవ కేంద్రం వద్దకు వచ్చి మాట్లాడాలంటూ బయటకు రమ్మని ఆమెను కోరాడు. అతని మాటలు నమ్మిన ఆమె బయటికి వస్తుండగా ముందుగా వెంట తెచ్చుకున్న కత్తితో రోషిణి గొంతుకోసి తాను ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. అక్కడే ఉన్నటువంటి మీసేవ యజమాని అతడిని అడ్డుకుని రక్తపు మడుగులో పడి ఉన్న రోషిణిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగా విషయం తెలిసిన చుట్టపక్కల వారు హుటాహుటిన మీసేవ కేంద్రం వద్దకు చేరుకుని వంశీధర్ చేతులోని కత్తిని లాక్కుని పడేశారు. అంతేకాకుండా తీవ్రమైన ఆవేశంతో అతడికి దేహశుద్ధి చేశారు. మీసేవ కేంద్రం నిర్వాహకుడు రోషిణిని ఆసుపత్రికి తరలించగా ఆమె మార్గమధ్యంలోనే మృతి చెందిందని తెలిసి రెచ్చిపోయిన స్థానికులు వంశీధర్‌ను మరింత చితకబాదారు. సమాచారం అందుకున్న కరీంనగర్ వన్‌టౌన్ సిఐ తులా శ్రీనివాస్‌రావు హుటాహుటిన తన సిబ్బందితో అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని వివరాలు తెలుసుకున్నాడు. విషయం నగరంలో వ్యాపించడంతో నగరవాసులు పెద్దఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోనికి తీసుకు వచ్చేందుకు పోలీసులు పెద్దఎత్తున మోహరించి ఏలాంటి గొడవలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. కరీంనగర్ టౌన్ ఎసిపి వెంకటరమణ నేతృత్వంలో బందోబస్తు నిర్వహించగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి. కమలాసన్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. సంఘటనపై కరీంనగర్ వన్‌టౌన్ సిఐ తుల శ్రీనివాస్‌రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా రోషిణిని హతమార్చిన నిందితుడు వంశీధర్‌ను నిందితుడిని ఎన్‌కౌంటర్ చేసి చంపుతారా లేక మాకు అప్పగిస్తారా అంటూ బాధిత కుటుంబసభ్యులతో కలిసి మహిళా నాయకురాళ్ళు పోలీసులను నిలదీశారు.

Comments

comments